https://oktelugu.com/

మహేష్ బాబుకు ఏమైంది.. ఎందుకిలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా కల్లోలంలో భయపడుతున్నారా? అందరు హీరోలు మునుపటిలా షూటింగ్ లకు మొగ్గు చూపుతుంటే మహేష్ బాబు మాత్రం వెనకడుగు వేస్తున్నారా? ఇప్పటికే హీరోలు అంతా డేట్స్ ఇచ్చిన వేళ మహేష్ బాబు మాత్రం ఎందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్‌కి తిరిగి వచ్చారు. అల్లు అర్జున్, రవితేజ, వెంకటేష్ జూలై మొదటి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 / 09:06 AM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా కల్లోలంలో భయపడుతున్నారా? అందరు హీరోలు మునుపటిలా షూటింగ్ లకు మొగ్గు చూపుతుంటే మహేష్ బాబు మాత్రం వెనకడుగు వేస్తున్నారా? ఇప్పటికే హీరోలు అంతా డేట్స్ ఇచ్చిన వేళ మహేష్ బాబు మాత్రం ఎందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

    టాలీవుడ్ అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్‌కి తిరిగి వచ్చారు. అల్లు అర్జున్, రవితేజ, వెంకటేష్ జూలై మొదటి వారం నుంచి తమ షూటింగ్ లను తిరిగి ప్రారంభిస్తారు. పవన్ కళ్యాణ్ జూలై 11న తిరిగి షూటింగ్ లోకి వస్తున్నాడు. షూట్స్ పున : ప్రారంభం గురించి స్పష్టత ఇవ్వని ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు మాత్రమే.

    “సర్కారీ వారీ పాటా” నిర్మాతలు మహేష్ బాబు నుంచి షూటింగ్ కు వస్తాడా? రాడా? అనే దానిపై ఎటువంటి నిర్ధారణకు రాలేదు. ఈ చిత్ర షూట్‌ను పున: ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు.

    కొత్త షెడ్యూల్‌ను జూలై మొదటి వారంలో ప్రారంభించాలని దర్శకుడు పరశురాం యోచిస్తున్నారు. మహేష్ నుంచి దీనికోసం అంగీకారం కోసం నిర్మాతలు వేచి ఉన్నారు.

    ఈ చిత్రం షూట్ గురించి త్రివిక్రమ్ కూడా ఆత్రుతగా ఉన్నాడు. ఎందుకంటే మహేష్ “సర్కారు వారీ పాటా” పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో కలిసి తన తదుపరి చిత్రాన్ని తీయబోతున్నాడు. సో ఈ సినిమా ఎంత వేగంగా పూర్తయితే అంతే వేగంగా కొత్త సినిమా ప్రారంభించడానికి ఆస్కారం ఉండబోతోంది. కానీ మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం షూటింగ్ చేయడానికి ఏమాత్రం ఆసక్తిగా లేడని తెలుస్తోంది.