https://oktelugu.com/

షాకింగ్ : ప్రముఖ సినీ కళా దర్శకుడు మృతి !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం క్యాన్సర్‌ తో ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత విషమిస్తూ వచ్చింది. దాంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆయన ఆరోగ్య ప‌రిస్థితి మరింతగా విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు. ఆయన వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. […]

Written By:
  • admin
  • , Updated On : June 28, 2021 / 09:03 AM IST
    Follow us on

    సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం క్యాన్సర్‌ తో ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత విషమిస్తూ వచ్చింది. దాంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆయన ఆరోగ్య ప‌రిస్థితి మరింతగా విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు.

    ఆయన వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. 40 ఏళ్లుగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందిస్తోన్న అంగముత్తు షణ్ముఖం స్థానిక నుంగంబాక్కంలోని కుమారప్ప మొదలి వీధిలో నివసిస్తున్నారు. అంగముత్తు షణ్ముఖం తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు పని చేయడం విశేషం.

    అలాగే షణ్ముఖం సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. మరియు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు కూడా మూడు సార్లు కార్యదర్శిగా పనిచేసిన ఘనత ఈయనకు ఉంది. అంగముత్తు షణ్ముఖం మృతికి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులు తదితరులు సంతాపం తెలియజేశారు.

    ఆయన భౌతిక కాయానికి నేడు స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అంగముత్తు షణ్ముఖం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము