Harihara Veeramallu Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియాలో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు . ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు కొనసాగిస్తున్నప్పటికి ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతుండటమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా తన సినిమాలు ఉండే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఇక ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో చాలా గ్రాండ్ గా కండక్ట్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైన డైరెక్టర్ అనుదీప్ కు అవమానం అయితే జరిగింది. పోలీసులు తనని పక్కకు తోసేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకని పోలీసులు అలా చేశారు ఆయనను చూడకుండా అలాంటి బిహేవియర్ చేశారా? లేదంటే కావాలని అలాంటి ఒక చర్యకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి అనుదీప్ చాలా కామెడీగా ఉంటాడు. ఏ ఈవెంట్ కి వెళ్లిన కూడా తను కామెడీ పంచ్ లతో ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో అనుదీప్ లాంటి దర్శకుడికి ఇలాంటి అవమానం జరగడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…
Also Read: తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా..?
మొత్తానికైతే పోలీసులు అతను దర్శకుడని గుర్తుపట్టక అలా చేసినట్టుగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ తర్వాత అనుదీప్ కూడా దానిని లైట్ తీసుకొని ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా అనుదీప్ లాంటి దర్శకుడు వచ్చిన ఈవెంట్ ఏదైనా కూడా చాలా సక్సెస్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటికే ఆయన విశ్వక్ సేన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇంతకుముందు ఆయన చేసిన జాతిరత్నలు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక మీదట ఆయన చేసే సినిమాలు కూడా కామెడీ సినిమాలే కావడం విశేషం…