https://oktelugu.com/

నిహారిక-చైతన్య ఇంట్లో ఏం జరిగింది? కేసు ఏమైందంటే?

మెగా డాటర్ నిహారిక దంపతులు ఏరికోరి ఎంచుకొని కాపురంచేస్తున్న అపార్ట్ మెంట్ లో నిన్న అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం నిహారిక, తన భర్త చైతన్యతో కలిసి బంజారాహిల్స్ పరిధిలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. విడిగా వీరిద్దరే ఉంటున్నారు. అయితే గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య నూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2021 / 05:42 PM IST
    Follow us on

    మెగా డాటర్ నిహారిక దంపతులు ఏరికోరి ఎంచుకొని కాపురంచేస్తున్న అపార్ట్ మెంట్ లో నిన్న అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం నిహారిక, తన భర్త చైతన్యతో కలిసి బంజారాహిల్స్ పరిధిలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. విడిగా వీరిద్దరే ఉంటున్నారు. అయితే గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య నూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్ మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశాడు. వీరిద్దరి గొడవపై పోలీసులు విచారిస్తున్నారు.

    హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ నుంచి షేక్ పేట్ కు వెళ్లే దారిలో ఓ అపార్ట్ మెంట్ లో నిహారిక దంపతులు ఫ్లాట్ అద్దెకు తీసుకొని తమ వృత్తిపపరమైన పనుల కోసం ఉపయోగించుకుంటున్నట్టు తెలిసింది. అయితే రెసిడెన్షియల్ సొసైటీలో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదని అపార్ట్ మెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగినట్టు తెలిసింది. చైతన్యపై బుధవారం రాత్రి పోలీసులకు న్యూసెన్స్ కేసు పెట్టారు.

    అయితే చైతన్య ఉంటున్న ఫ్లాట్ కు గత కొన్ని రోజులుగా కొంతమంది యువకులు వస్తున్నారని.. మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇక చైతన తన ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గొడవకు దిగారని.. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    అయితే మెగా అల్లుడు కావడంతో చిరంజీవి, నాగబాబులు రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్టు తెలిసింది. దీంతో కేసులు వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించివేశారని తెలిసింది.

    నిహారికకు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఇటీవల డిసెంబర్ లో ఘనంగా జరిపించారు. ఇక వివాహం తర్వాత నిహారిక తన భర్త చైతన్యతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.వివాహం తర్వాత తన వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలతోపాటు ఆ మధ్య మాల్దీవులకు హనీమూన్, ఇటీవల పాండిచ్చేరిలో ఎంజాయ్ చేసిన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిహారిక హంగామా చేసింది. ఇక చైతన్య ఒక కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజా గొడవతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు.