ఏంటి ? అందరికీ ఆయనతోనే ఏం పని !

దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో కృష్ణంరాజుగారు హీరోగా చేస్తోన్న సినిమా షూటింగ్‌ రాజమండ్రి దగ్గర పూడిపల్లిలో మొదలైంది. దాసరి, సత్యనారాయణ కోసం ఒక వేషం రాశారు. కానీ సత్యనారాయణగారు అందుబాటులో లేరు. ఎవరో కోట శ్రీనివాసరావు అట, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అని దాసరికి రికమండ్ చేశారు, సత్యనారాయణ రోల్ ఇవ్వమని. దాసరికి ఇష్టం లేదు. అది సినిమాలోనే కీలక పాత్ర, కోటకి ఇవ్వాలనుకొలేదు. కానీ తప్పింది కాదు. అలా కోటకు మంచి వేషం ఇచ్చారు. ఉదయం ఏడు గంటలకే […]

Written By: admin, Updated On : August 5, 2021 5:43 pm
Follow us on

దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో కృష్ణంరాజుగారు హీరోగా చేస్తోన్న సినిమా షూటింగ్‌ రాజమండ్రి దగ్గర పూడిపల్లిలో మొదలైంది. దాసరి, సత్యనారాయణ కోసం ఒక వేషం రాశారు. కానీ సత్యనారాయణగారు అందుబాటులో లేరు. ఎవరో కోట శ్రీనివాసరావు అట, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అని దాసరికి రికమండ్ చేశారు, సత్యనారాయణ రోల్ ఇవ్వమని.

దాసరికి ఇష్టం లేదు. అది సినిమాలోనే కీలక పాత్ర, కోటకి ఇవ్వాలనుకొలేదు. కానీ తప్పింది కాదు. అలా కోటకు మంచి వేషం ఇచ్చారు. ఉదయం ఏడు గంటలకే కోట సెట్ కి వచ్చి మేకప్‌ వేసుకుంటున్నాడు. ‘క్రమశిక్షణ కలిగిన నటుడే’ అంటూ దాసరి కోటను చూసి అన్నారు. షూటింగ్ మొదలైపోయింది. సాయంత్రం అవుతుంది. సెట్ కి బయట మేనేజర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు.

దాసరి కోసం ఎదురుచూడటం అప్పట్లో చాలా సర్వసాధారణం. వాళ్ళను లోపలికి పిలిచాడు దాసరి. ఐదారుగురు ప్రొడక్షన్ మేనేజర్లు ఎదురుగా వచ్చి కూర్చున్నారు. దాసరిగారు వాళ్ళు తన కోసమే వచ్చారు అనుకుని.. ‘ఏంటి ఇలా వచ్చారు, నేను బిజీగా ఉన్నాను. మళ్ళీ మాట్లాడుకుందాం’ అంటూ లేచి వెళ్లబోయారు.

వారిలో ఒకరు ‘అయ్యో, వచ్చింది మీ కోసం కాదు అండి. కోటగారి కోసం’. దాసరి షాక్ గా ఇంకొకరి వైపు చూశారు. ఆ మేనేజర్ ది అదే మాట. వరుసగా మిగిలిన ముగ్గురిదీ అదేమాట. దాసరికి వారి మాట కొత్తగా అనిపించింది. కొత్తగా వచ్చిన నటుడు కోసం ఇంతమంది మేనేజర్లు రావడం ఏమిటి ? అందుకే డౌట్ గానే అడుగుతూ ‘ఏంటి విషయం? అందరికీ కోటతోనే ఏం పని’ అని అడిగారు.

అందరూ ఒకేసారి మాకు ఆయన డేట్లు కావాలండీ. కాల్షీట్లు ఎవరు చూస్తున్నారో తెలియడం లేదు. అందుకే, ఇలా సెట్ కి వచ్చేశాం’ అని చెప్పుకుంటూ పోతున్నారు. దాసరికి అర్ధమైపోయింది. కోటగారిని పిలిచి.. ‘నువ్వు గొప్ప నటుడు అవుతావు, మరో ఎస్వీయార్ అవుతావు’ అని దాసరి అక్కడ ఉన్న సీనియర్ మేనేజర్ జ్యోతి ప్రసాద్‌ ను పిలిచి ‘ఏమనుకోకుండా కోట డేట్లు నువ్వు చూడాలి. పైకెదిగే ఆర్టిస్టు. జాగ్రత్త, పొరపాటు జరిగితే నేనూరుకోను’ అంటూ కోటకి డేట్లు ఎలా ఇవ్వాలో కూడా దాసరిగారే చెప్పారట.