Nagarjuna And Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంతటి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో నాగార్జున కావడం విశేషం…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో తను పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇక నాగార్జున ఒకప్పుడు చేసిన మన్మధుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఆ సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు అందించడం విశేషం… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా అయితే రాలేదు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత కూడా నాగార్జునతో సినిమా చేయాలని అనుకోలేదు. మన్మధుడు సినిమా చేసే సమయంలో వీళ్ళ మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి…ఇక మన్మధుడు సినిమా సమయంలో కొన్ని విషయాల్లో త్రివిక్రమ్ ను నాగార్జున కొంతవరకు దూరం పెట్టారట.
Also Read: టీవీ5 సాంబ సార్ క్రికెట్ పాఠాలు.. నేర్చుకోండయ్యా?
అందువల్లే త్రివిక్రమ్ హర్ట్ అయి నాగార్జున బ్యానర్లో గాని, నాగార్జునతో గాని మరో సినిమా చేయలేదు. అందుకే వేరే వాళ్ళతో సినిమాలను చేస్తూ వచ్చాడు కానీ నాగార్జునతో చేయలేదు. నిజానికి ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న సినిమా కూడా ఒకప్పుడు నాగార్జున కోసం రాసుకున్నదే అని త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
కానీ నాగార్జున – త్రివిక్రమ్ మధ్య కొన్ని ఇష్యూస్ రావడంతో ఆ సినిమాను ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్నాడట…ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో మన్మధుడు లాంటి ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావడం అనేది అసాధ్యమని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా నాగార్జున లాంటి నటుడికి స్టార్ ఇమేజ్ ఉండటమే కాకుండా తను ఎలాంటి కథతో వచ్చిన కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ నాగార్జున ఇప్పుడు వైవిద్య భరితమైన సినిమాలను చేయడం కంటే కూడా రొటీన్ సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…