TV5 Sambasiva Rao: ఆసియా కప్ లో చెలరేగిన షేక్ హ్యాండ్ వివాదం ఇంకా తగ్గడం లేదు. భారత జట్టు ఆటగాళ్లు, మేనేజ్మెంట్ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ ప్లేయర్లు.. మేనేజ్మెంట్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా తలతిక్క వాదనతో తమను తాము మరింత చులకన చేసుకుంటున్నారు. ఐసీసీ స్పందించకపోయినప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టించుకోకపోయినప్పటికీ పాకిస్తాన్ మేనేజ్మెంట్ సోది వాగుడు వాగుతోంది. ఇక ఆ జట్టు ప్లేయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ ఐసీసీ భారత్ వైపు ఉన్నది. ఎందుకంటే షేక్ హ్యాండ్ పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని ఐసిసికి కూడా తెలుసు. అందువల్లే సైలెంట్ గా ఉంది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు షేక్ హ్యాండ్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన నేపథ్యంలో.. రకరకాల వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఓ వీడియో టివి5 ఛానల్ లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు సాంబశివరావుకు సంబంధించింది. సాంబశివరావు ప్రైమ్ టైం డిబేట్ లు నిర్వహిస్తుంటారు. వర్తమాన రాజకీయాలపై.. ఇతర విషయాలపై తనదైన శైలిలో విశ్లేషణ కొనసాగిస్తుంటారు. తనకు తెలిసిన విషయాల ద్వారా వాటిని రక్తి కట్టిస్తుంటారు. అందువల్లే సాంబశివరావు అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక ఏపీ విషయంలో సాంబశివరావు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. అఫ్కోర్స్ ఆ ఛానల్ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు కాబట్టి సాంబశివరావు ఆ స్టాండ్ తీసుకొని ఉంటారు. పైగా మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా వ్యవహరించలేరు కాబట్టి సాంబశివరావుకు తప్పదు.
సాంబశివరావు అప్పుడప్పుడు తన లైన్ దాటి మాట్లాడుతుంటారు. అది చాలామందికి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది కాబట్టి. తాజాగా ఒక డిబేట్లో సాంబశివరావు క్రికెట్ గురించి మాట్లాడారు. ఎల్బీ డబ్ల్యూ, క్యాచ్ ఔట్, స్టంప్ ఔట్, రన్ ఔట్, కవర్ డ్రైవ్, అప్పర్ కట్ గురించి మాట్లాడారు. తనలో కూడా అద్భుతమైన క్రికెటర్ ఉన్నాడని సాంబశివరావు నిరూపించుకున్నారు. సాంబశివరావు క్రికెట్ గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. “ఇచ్చట ప్రాథమిక క్రికెట్ నైపుణ్యాలు నేర్పబడును” అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇచ్చట…ప్రాథమిక క్రికెట్ నైపుణ్యాలను నేర్పబడును!!! pic.twitter.com/H7GeWDuzur
— The Samosa Times (@Samotimes2026) September 17, 2025