https://oktelugu.com/

Karthika Deepam Chandu: కార్తీకదీపం చందు మరణానికి ముందు ఏం జరిగింది? వాట్సాప్ ఛాట్ లీక్ చేసిన కరాటే కళ్యాణి!

పవిత్ర జయరామ్-చందు గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. భార్య శృతితో విడిపోయిన చందు ఒంటరి అయిన పవిత్ర జయరామ్ కి దగ్గరయ్యారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 18, 2024 / 02:06 PM IST

    What happened before the Karthika deepam Chandu death

    Follow us on

    Karthika Deepam Chandu: సీరియల్ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చందు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. నటి పవిత్ర జయరామ్ మరణం నేపథ్యంలో చందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా చందు మరణానికి ముందు ఏం జరిగిందో నటి కరాటే కళ్యాణి తెలియజేసింది. ఆమె కీలకమైన వాట్సాప్ ఛాట్ లీక్ చేసింది.

    పవిత్ర జయరామ్-చందు గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. భార్య శృతితో విడిపోయిన చందు ఒంటరి అయిన పవిత్ర జయరామ్ కి దగ్గరయ్యారు. పవిత్ర జయరామ్ సింగిల్ పేరెంట్. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మే 12న బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న పవిత్ర జయరామ్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ తో పాటు పవిత్ర జయరామ్, చందు, పవిత్ర జయరామ్ కూతురు, మరొక అమ్మాయి ఉన్నారు. గాయాలు మాత్రం చందుకి అయ్యాయి.

    చందు సమాచారం ప్రకారం తనకు ఏమైందనే షాక్ లో పవిత్రకు హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే ఆమె మరణించారని అంటున్నారు. పవిత్ర మరణంతో డిప్రెషన్ కి గురైన చందు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా చనిపోవడానికి ముందు నటి కరాటే కళ్యాణితో చందు వాట్సాప్ లో ఛాట్ చేశాడు. సదరు ఛాట్ సోషల్ మీడియాలో పంచుకున్న కరాటే కళ్యాణి… తెలిసినా ఆపలేకపోయానని ఆవేదన చెందారు.

    వాట్సాప్ ఛాట్ పరిశీలిస్తే… నేను కూడా చనిపోతాను. ఆమె లేకుండా నేను ఉండలేను. ఉంటే పిచ్చోడిని అయినా అవుతా లేదా ముందుకు బానిస అవుతా. అది నా కుటుంబ సభ్యులను బాధపెడుతుంది. అందుకే చనిపోవాలని అనుకుంటున్నాను, అని చందు అన్నాడు. నీకు మేము ఉన్నాము. అలాంటి నిర్ణయం తీసుకోకు అని ఓదార్చే ప్రయత్నం చేసింది కరాటే కళ్యాణి. ప్రయాణంలో ఉండి నిన్న చందుతో మాట్లాడటం కుదరలేదన్న కరాటే కళ్యాణి దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.