https://oktelugu.com/

Nagababu: మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చిన నాగబాబు… వస్తూనే సంచలన ట్వీట్!

మే 13న ఏపీలో ఎన్నికలు కాగా... సరిగ్గా రెండు రోజుల ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి మద్దతు ప్రకటించాడు. శిల్పా రవి పోటీ చేస్తున్న నంద్యాలకు స్వయంగా వెళ్లారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 18, 2024 / 01:55 PM IST

    Nagababu Sensational Tweets

    Follow us on

    Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా కామెంట్ పెద్ద వివాదం రాజేసింది. నాగబాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా హీరో అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడన్న వాదన వినిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో మెగా ఫ్యాన్స్ మధ్య అంతర్గత సోషల్ మీడియా వార్ షురూ అయ్యింది. ఈ వివాదంపై చిరంజీవి సైతం ఒకింత అసహనం వ్యక్తం చేశాడనే ఊహాగానాలు వినిపించాయి. నాగబాబు ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ వివాదం ఏమిటని పరిశీలిస్తే…

    మే 13న ఏపీలో ఎన్నికలు కాగా… సరిగ్గా రెండు రోజుల ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి మద్దతు ప్రకటించాడు. శిల్పా రవి పోటీ చేస్తున్న నంద్యాలకు స్వయంగా వెళ్లారు. శిల్పా రవి ఇంటి ముందు పెద్ద ఎత్తున అభిమానులు చేరారు. వాళ్లకు అభివాదం చేసిన అల్లు అర్జున్, శిల్పా రవి చేయి పైకి ఎత్తి తన మద్దతు తెలియజేశారు. శిల్పా రవిని గెలిపించాలని కోరాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్… శిల్పా రవి నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు కలిసినా నంద్యాల గురించి మాట్లాడతాడు. తన ప్రాంతానికి మంచి చేయాలనే మంచి ఉద్దేశం ఉన్న శిల్పా రవికి మద్దతు తెలపడం బాధ్యతగా భావిస్తున్నాను. అందుకే నంద్యాల వచ్చాను అన్నారు.

    ఇది జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ నేతల్లో అసహనానికి కారణమైంది. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, పరాయివాడైనా మా కోసం పని చేసేవాడు మావాడు’ అని ట్వీట్ చేశాడు. ఈ కామెంట్ దుమారం రేపింది. వైసీపీ నేతకు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో వాదన మొదలైంది.

    అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్ చేశారు. దాంతో ఆయన తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. దాంతో ఈ వివాదం చాలా పెద్దదైందని, అల్లు-కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైందనే వాదన మొదలైంది. నాగబాబు మరలా తన అకౌంట్ యాక్టీవ్ లోకి తెచ్చారు. వస్తూనే ‘నేను ఆ ట్వీట్ డిలీట్ చేశాను’ అని కామెంట్ పెట్టారు. నాగబాబు ట్వీట్ వైరల్ అవుతుండగా… మరలా సదరు ట్వీట్ క్రింద కామెంట్స్ హోరెత్తుతున్నాయి.