Telugu Cinema: తెలుగు సినిమా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగానే ఉంది. ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని స్థితికి వచ్చేసింది పరిశ్రమ. దీనికితోడు ప్రభుత్వాలకు సినిమా అనగానే ఓ చులకన భావన అయిపోయింది. అందరూ సినిమాను కేవలం ఒక వినోద సాధనంగానే చూస్తున్నారు. కానీ, ఎందరికో అది ఓ ప్రపంచం. అయితే, సినిమాను విజ్ఞాన గని అని పొగిడేవాళ్లు ఉన్నారు, అదొక బూతు మయం అని తిట్టేవాళ్ళు ఉన్నారు.

కానీ, ప్రపంచంలో ఏది పరిపూర్ణమైన మంచి మాత్రమే చేయలేదు కదా. ప్రాణాలు నిలిపే మెడిసన్స్ వల్ల కూడా, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సినిమా కూడా అంతే. సినిమా మూర్ఖుణ్ణి మేధావిని చేస్తుంది. అలాగే టైం బాగాలేకపోతే మేధావిని కూడా మూర్ఖుణ్ణి చేస్తుంది. ఇండస్ట్రీలో ఏ టాలెంట్ లేకపోయినా స్టార్ హీరో అయినవాళ్లు ఉన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉండి అనామకులుగా మిగిలిపోయినవాళ్లు ఉన్నారు.
అందుకే, సినిమా అనేది ఒక్క కలల ప్రపంచమే కాదు, మాయ ప్రపంచం కూడా. అలాగే కొద్ది పాటి పెట్టుబడితో కోటీశ్వరుడు అయిన నిర్మాత ఉన్నాడు, పెద్ద కోటీశ్వరుడిగా సినిమా పరిశ్రమకు వచ్చి.. బిక్షాధికారిగా మారిన నిర్మాతలు ఉన్నారు. అందుకే సినీమా(య) ఇది. కానీ సినిమా అంటే ఒక్కరు ఇద్దరు కాదు, కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం. లక్షల మందికి ఏకైక ఉపాధి సాధనం.
అలాగే కోట్లాది ప్రేక్షకులకు సినిమా అంటే ఓ అలవాటు, సినిమా అంటే ఓ ఆనవాయితీ. మొదటి రోజు మొదటి ఆట చూసి.. గోల్డ్ మెడల్ కొట్టినంత ఆనందపడే వీరాభిమానులు.. కటౌట్ లకు పాలాభిషేకం చేసే వీర భక్తి పరులు, రెండు రూపాయల టిక్కెట్టు ను రెండు వేలకైనా సరే కొనుక్కునే అభిమాన దురంధరులు ఉన్న మన తెలుగు సినిమాకి.. ఇంతటి గడ్డు పరిస్థితి వస్తోందని ఎన్నడూ ఎవ్వరూ ఊహించలేదు. .
తెలుగు తెర పై కాసులు కురిపించే ప్రేక్షక దేవుళ్ళు కూడా, ఇప్పుడు సినిమాలకు పట్టిన గతిని చూసి తల్లడిల్లిపోతున్నారు. అసలు తెలుగు వెండితెరకు నిజమైన పండుగ అంటే సంక్రాంతినే. సంక్రాంతి పోటీలో వచ్చే సినిమాల కోసం అభిమానులు జాతర చేస్తారు. ఇక ఆ అభిమానులను మెప్పించడం కోసమే.. సంక్రాంతి చిత్రాలు కూడా పంచ్ డైలాగులతో అదిరిపోయే మాస్ స్టెప్పులతో, హోరెత్తించే ఊపు పాటలతో నిజంగానే పండగ చేస్తాయి.
Also Read: ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగి.. ఆ తర్వాత దీన పరిస్థితులు ఎదుర్కొన్నది వీరే…
అసలు ఇవేవి లేనిది, తెలుగు వారికి సంక్రాంతి పండుగే లేదు. మరి సరదా సందడి లేని ఈ సంక్రాంతికి కారణమెవరు ? రకరకాల కారణాలు చెప్పి.. సినిమాకి ప్రేక్షకుడికి
ప్రభుత్వం అడ్డుగోడ కడితే.. వినోదం కోల్పోయిన జనం ప్రభుత్వం తిరుగుతుబాటు చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం జగన్ ప్రభుత్వ చర్యల కారణంగా సినీ జీవితాలకు జీవనాధారం లేకుండా పోతుంది.
సినిమా భవితవ్యం ఆంధ్రాలోనే అంధకారం మారడం, నిజంగా జీర్ణయించుకోలేని బాధాకరం. అసలు తెలుగు వెండితెర మసక బారితే.. తెలుగు వారి ఆత్మగౌరవానికి మసిపూసినట్టే. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి కనువింపు కలగాలని ఆశిద్దాం.
[…] Also Read: తెలుగు వెండితెర మసక బారితే.. తెలుగు వా… […]