https://oktelugu.com/

Sidharth Malhotra: సిద్ధార్థ్ మల్హోత్రా విషయం లో ఆ మోడల్ చేసిన తప్పేంటి..? కియారా అద్వానికి ఆ మోడల్ కి మధ్య సంబంధం ఏంటి..?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వస్తున్నప్పటికీ అందులో ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 05:06 PM IST

    Sidharth Malhotra

    Follow us on

    Sidharth Malhotra: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ సిద్ధార్థ్ మల్హోత్రా కి మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను తాను ఒక స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కియారా అద్వాని కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక వీళ్లిద్దరూ అంగరంగ వైభవంగా డ్రీమ్ వెడ్డింగ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఈవెంట్ కి హాజరైన సిద్ధార్థ్ మల్హోత్రా బ్లాక్ సూట్ లో అద్భుతంగా ఉన్నాడు. ఇక అతన్ని చూసిన ఒక మోడల్ స్టేజ్ మీదనే ఆయన్ని ఫ్లట్టింగ్ చేస్తూ ఆయన అందానికి ఫిదా అయిపోయింది. ఇక ఇలాంటి క్రమంలో సిద్ధార్థ్ మల్హోత్ర కూడా స్టేజ్ మీద ఆమె చేసే పనులకు చాలా అన్ కంఫర్ట్ గా ఫీల్ అయినట్టుగా కూడా మనకు ఆ వీడియో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆ మోడల్ చేసిన పనికి ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంకా వీడియోను చూస్తున్న చాలామంది నెటిజన్లు సైతం కియారా ఈ వీడియో కనక చూస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది.

    ఆ మోడల్ కి సరైన సమాధానం చెబుతుందా లేదంటే సిద్ధార్థ్ మల్హోత్రా తో గొడవ పెట్టుకుంటుందా అంటూ పలువురు పలు కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదంతా చూసిన ఆ మోడల్ ఆ వీడియోని షేర్ చేస్తూ నేను సిద్ధార్థ్ మల్హోత్రా గారి విషయంలో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాను. ఆయన అంత అన్ కంఫర్ట్ గా ఫీలయ్యేలా ఆయనను ఇబ్బంది పెట్టినందుకు కియారా అద్వాని ని ఉద్దేశిస్తూ మీ భర్తని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ కియారా అద్వాని ని తను అపాలజీ కోరింది.

    ఇక ఇది చూసిన నెటిజన్లు మాత్రం ఆ మోడల్ తప్పు చేసినా కూడా తన తప్పు తెలుసుకొని రియలైజ్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అలాగే కియారా అద్వాని ని క్షమించమని అడగడం కూడా తన ఉన్నతమైన భావాలను సూచిస్తుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు… ఇక ప్రస్తుతం కియారా అద్వానీ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

    ఇక ఇంతకుముందు మహేష్ బాబు హీరో గా వచ్చిన ‘భరత్ అను నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి నటి గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ సాధించలేదు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమాతో ఇప్పుడు భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తుంది…