https://oktelugu.com/

Kalki 2898 AD: ‘కల్కి’ చిత్రానికి భారీ నష్టాలు మిగిల్చిన ఏకైక ప్రాంతం అదేనా ?

ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా కొన్ని ప్రాంతాలలో నష్టాలు వస్తుంటాయి. అన్నీ సూపర్ హిట్ సినిమాలకు అలా జరుగుతుంది అని చెప్పలేము కానీ, నూటికి ఒక పది సినిమాలకు మాత్రం కచ్చితంగా జరుగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 / 05:02 PM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన కళ్లారా చూసాము. టీజర్, ట్రైలర్స్ తో అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసిన సినిమాలు ఎక్కువ శాతం ఆ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయినవే మనం చూసాము. కేవలం రాజమౌళి సినిమాలు మాత్రమే అలాంటి అంచనాలను అందుకునేవి. కానీ నాగ అశ్విన్ మాత్రం ఉన్న అంచనాలను మించి ‘కల్కి’ చిత్రాన్ని తీసాడు. ఈ సినిమాని చూస్తున్నంతసేపు అసలు మనం తెలుగు సినిమాని చూస్తున్నామా, లేదా హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా అనే అనుభూతి కలిగించాడు. మహాభారతం లాంటి పురాణాలను సైన్స్ ఫిక్షన్ జోడించి ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనే అద్భుతం. ఆ ఆలోచనని ఆచరణలో చేపడితే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం ఎంత సులువో ఈ చిత్రం ద్వారా నిరూపించాడు నాగ అశ్విన్.

    అయితే ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా కొన్ని ప్రాంతాలలో నష్టాలు వస్తుంటాయి. అన్నీ సూపర్ హిట్ సినిమాలకు అలా జరుగుతుంది అని చెప్పలేము కానీ, నూటికి ఒక పది సినిమాలకు మాత్రం కచ్చితంగా జరుగుతుంది. అలా కల్కి సినిమాకి కూడా జరిగింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి ఒక ప్రాంతం లో మాత్రం నష్టం వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే కల్కి చిత్రం సీడెడ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 27 కోట్ల రూపాయలకు జరుపుకుంది. ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 23 నుండి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే ఈ ప్రాంతం లో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. లాంగ్ రన్ లో అద్భుతమైన వసూళ్లు వచ్చినప్పటికీ, సీడెడ్ లో ఓపెనింగ్ మాత్రం చాలా మాములుగా ఉన్నింది. దాని ప్రభావం క్లోసింగ్ కలెక్షన్స్ లో చూపించింది.

    ఒకవేళ ఈ సినిమా బడ్జెట్ కి, హైప్ కి తగ్గట్టుగా సీడెడ్ లో పది కోట్ల రూపాయిల షేర్ ని మొదటిరోజు రాబట్టి ఉంటే ఈరోజు కనీసం మూడు కోట్ల రూపాయిల లాభం ఉండేది. అయినప్పటికీ కూడా సీడెడ్ ప్రాంతం లో రాజమౌళి సినిమా కాకుండా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఏకైక హీరోగా ప్రభాస్ ఇక్కడ సంచలనం సృష్టించాడు. కేవలం కల్కి చిత్రంతోనే కాదు, ఆయన ‘సలార్’ చిత్రం తో కూడా గత ఏడాది సీడెడ్ ప్రాంతం లో 20 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాడు. మిగిలిన స్టార్ హీరోలు సీడెడ్ లో 15 కోట్ల రూపాయిల షేర్ ని కొట్టడమే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో ఏకంగా ఏడాదిలోపే రెండు సార్లు 20 కోట్ల రూపాయిల షేర్ ని సీడెడ్ ప్రాంతం లో కొట్టడం అంతే ప్రభాస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.