https://oktelugu.com/

చంద్రబాబుకు వల్లభనేని వంశీ స్వాగతం.. తమ్ముళ్ల షాక్

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టి కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పరుష విమర్శలు చేస్తూ జగన్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు. అయితే తాజాగా ఆయనను స్వాగతించిన అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. Also Read: విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ.. తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మాజీ బాస్ అయిన చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 11:01 AM IST
    Follow us on

    టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టి కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పరుష విమర్శలు చేస్తూ జగన్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు. అయితే తాజాగా ఆయనను స్వాగతించిన అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

    Also Read: విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

    తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మాజీ బాస్ అయిన చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. చంద్రబాబు అమరావతి పర్యటనను దెప్పి పొడుస్తూ కవితాత్మక ధోరణిలో వంశీ ఓ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరదేశి.. అజ్ఞాతవాసి.. తెలంగాణ రాష్ట్ర నివాసి.. మాన్యశ్రీ చంద్రబాబు గారి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం.. సుస్వాగతం’ అంటూ దెప్పిపొడిస్తూ సెటైర్ గా వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు.

    అసలే టీడీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటారు. దీంతో టీడీపీ ఫ్యాన్స్ వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై సెటైర్లు వేసినందుకు వంశీని అదే సోషల్ మీడియాలో ఎండగట్టారు.. ఇప్పుడ ట్వీట్లు.. రీట్వీట్లు, కౌంటర్లతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది వైరల్ అవుతోంది.

    Also Read: జగన్‌ వలసలను ప్రోత్సహిస్తోంది అందుకేనా..?

    వల్లభనేని వంశీ ట్వీట్ తర్వాత వైసీపీ కార్యకర్తలు వర్సెస్ తెలుగు తమ్ముళ్ల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ నడుస్తోంది.. ఈ క్రమంలోనే వంశీకి కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు ఘాటు పదజాలంతో అదే రీతిలో పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు.. ఈ సందర్భంగా ‘వైస్సార్సీపీ లో “పరదేశి” రాజకీయ భవిష్యత్ “అజ్ఞాతవాసి”.. తెలంగాణా రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే “పిపాసి”.. గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు-శుభాభివందనాలు.’ అంటూ టీడీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ లోనే గట్టిగా బదులిచ్చారు. ఇలా వంశీ తాజాగా చంద్రబాబుపై సెటైర్లు వేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ ఫ్యాన్స్ కౌంటర్లతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా పంచులు పేలుతున్నాయి. చూడడానికి ఇది యమ రంజుగా సాగుతోంది. వైరల్ అవుతోంది.

    https://twitter.com/DrVVamsi/status/1313881487507292161?s=20