https://oktelugu.com/

Ram Charan – Upasana : చరణ్ కి పాప పుట్టింది అనే ఆనందంలో పవన్ కళ్యాణ్ ఏమి చేసాడో తెలుసా.. తండ్రీకొడుకులను మించిన అనుబంధం ఇది!

ఉదయం నుండి పవన్ కళ్యాణ్ నుండి శుభాకాంక్షల ట్వీట్ రాకపోయేసరికి అసలు ట్వీట్ వస్తుందా రాదా అనే సందేహం లో ఉన్న సమయంలో కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేసాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2023 / 08:47 PM IST

    Pawan kalyan

    Follow us on

    Ram Charan – Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పాప పుట్టింది అనే వార్త తెలుసుకొని మెగా ఫ్యామిలీ ఎంత సంతోషం లో మునిగి తేలుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి , అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా రామ్ చరణ్ , ఉపాసనకు శుభాకాంక్షలు తెలియచేసారు. అయితే ఎంతమంది శుభాకాంక్షలు తెలియచేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూసేది పవన్ కళ్యాణ్ శుభాకాంక్షల కోసమే.

    ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ నుంచి శుభాకాంక్షల ట్వీట్ రాకపోయేసరికి అసలు ట్వీట్ వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్న సమయంలో కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేసాడు. ఈ ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ అభిమానులు రీట్వీట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి విజయయాత్ర’లో ఉండడం వల్ల అపోలో హాస్పిటల్ కి వచ్చి పాపని చూడలేకపోయాడు.

    ఇదొక్కటే అభిమానులను కాస్త నిరాశకి గురిచేసిన విషయం. కానీ తాను దగ్గర లేకపోయినా కూడా ఉపాసన డెలివరీ డేట్ తెలుసు కాబట్టి, సరిగ్గా అదే రోజు పాప మేడలో తన తరుపున వేయాల్సిన గోల్డ్ చైన్ చైన్ ని బహుమతిగా పంపించాడట పవన్ కళ్యాణ్. చాలా రోజుల క్రితమే ఈ గోల్డ్ చైన్ చేయించి, సరిగ్గా ఆ రోజే డెలివరీ అయ్యేటట్టు ప్లాన్ చేసాడట.

    పవన్ కళ్యాణ్ తరుపున వచ్చిన ఈ స్వీట్ సర్ ప్రైజ్ ని చూసి రామ్ చరణ్ – ఉపాసన ఎంతో సంతోషించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. కుటుంబం అంటే ఇలాగే ఉండాలి. బంధాలు – అనుబంధాలు అంటే ఈ స్థాయిలోనే ఉండాలి అని మెగా అభిమానులు సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు హైదరాబాద్ కి వస్తాడో, ఎప్పుడు పాపని చూస్తాడో చూడాలి.