AP CM Chandrababu Naidu : గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక అలజడి అయితే జరుగుతుంది. ఇక మొన్నటి వరకు మంచు ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ గొడవలను బహిర్గతం చేయడంతో వాళ్ళ మధ్య తీవ్రమైన విమర్శలైతే వచ్చాయి. ఇక అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఆయన బెయిల్ మీద మళ్లీ ఇంటికి తిరిగి రావడం పట్ల అతని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం నాంపల్లి కోర్టు రిమాండ్ కి పంపడం. మళ్ళీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ని ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. ఇక మొత్తానికైతే ఇవాళ ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి ఎమోషనల్ అయ్యారు. ఇక మొత్తానికైతే ఆయన రావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పరోక్షంగా జరిగిన తప్పుకి తను బాధ్యుడు కాడని కొందరు వాదిస్తుంటే మరి కొంత మంది మాత్రం ఏది ఏమైనా కూడా అది అల్లు అర్జున్ వల్లే జరిగిందని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్ మద్యంతర బెయిల్ మీద బయట తిరుగుతున్నప్పటికి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది…
ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అరవింద్ కి ఫోన్ చేశాడట. ఇక ఆయన ఫోన్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించిన పూర్తి బాధ్యతను మేం తీసుకుంటాం అంటూ ఆయన మాట్లాడినట్టు గా తెలుస్తోంది. ఇక దీంతో అల్లు అరవింద్ కి కొంతవరకు ధైర్యమైతే వచ్చిందనే చెప్పాలి. తన కొడుకు అరెస్టు నేపథ్యంలో ఆయన కొంతవరకు కృంగిపోయారు.
మరి మొత్తానికైతే ఇప్పుడు ఆయన కూడా కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా మెగా ఫ్యామిలీ హీరోలు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు సైతం అల్లు అర్జున్ కు మద్దతుగా నిలవడం మెగా ఫ్యామిలీ యొక్క బలాన్ని సూచిస్తుందనే చెప్పాలి.
ఇక గత కొద్ది రోజుల నుంచి వీళ్ల మధ్య గొడవలు ఉన్నాయంటూ చాలామంది విమర్శలు చేస్తున్నప్పటికి వాళ్లకు ఎటువంటి గొడవలు లేవు అంతా ఒకటే అని నిరూపిస్తూ వాళ్ళు అందరూ ఆయనకు సపోర్టుగా నిలవడం అనేది ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…