Akhanda 2 release issues: బాలయ్య హీరోగా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతోంది.కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే ధోరణి ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…అఖండ 2 మూవీ ప్రొడ్యూసర్స్ సైతం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి డబ్బులు సెటిల్మెంట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కానీ ఇప్పుడు కొత్త డేట్ ని అడ్జస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు విపరీతమైన కష్టాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే మిగతా డేట్లలో కొన్ని సినిమాలు లాక్ అయి ఉన్నాయి.
ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబు సైతం క్రిస్మస్ పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఈనెల 25వ తేదీన వస్తే సినిమాకి కలెక్షన్స్ బాగానే ఉంటాయి. సంక్రాంతి వరకు సినిమా లాంగ్ రన్ లో ముందుకు సాగుతోంది.
కానీ ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక దానికి తోడుగా డిసెంబర్ 12వ తేదీన వచ్చినట్టయితే థియేటర్లు ఎక్కువ దొరకడమే కాకుండా ఒక నెల రోజులపాటు సినిమాకి లాంగ్ రన్ దొరుకుతోంది…ఇక సినిమా రిలీజ్ లేట్ అయ్యేకొద్ది ప్రేక్షకుల్లో సినిమా మీద హైప్ తగ్గిపోతోంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి.
కాబట్టి డిసెంబర్ 12న రిలీజ్ చేస్తే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయి సూపర్ సక్సెస్ ని సాధించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 12 వ తేదీన వస్తుందా లేదంటే డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ తొందర్లోనే అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…