Former sarpanch controversy: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు విడతల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో మూడు రోజుల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో నేతల ప్రచారంతో పల్లెలు హోరెత్తుతున్నాయి. ఎత్తులు, చిత్తులు, వ్యూహాలు, ప్రణాళికలు.. దావత్‌లు, కానుకల పంపిణీ ఇలా అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్ చేష్టలు అందరినీ షాక్‌కు గుచిచేస్తున్నాయి. ఆ గ్రామ ప్రజలను భయపెడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు చేస్తున్న అసాధారణ ఆచారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాత్రి క్షుద్ర పూజలు..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పగలు రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్న నాగరాజు, రాత్రి సమయంలో తాంత్రిక పూజలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్నం రాసులపై మాంసం, రక్త సమర్పణలు చేసి నిమ్మకాయను గాలిలో ఎగరవేసే దృశ్యాల వీడియోలు వైరల్ చేస్తున్నారు. అమాయక గిరిజన సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు సంపాదన ఉద్దేశంతో మూఢ విశ్వాసాలను ప్రోత్సహిస్తున్నారని గ్రామవాసులు ఫిర్యాది చేస్తున్నారు.
చర్యలకు గ్రామస్తుల డిమాండ్..
మాజీ సర్పంచ్ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని కొమ్ముగూడెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అతడిని అరెస్టు చేయాలని తమను కాపాడాని వేడుకుంటున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే నాగరాజు గతంలో నకిలీ పాస్‌పోర్టు కేసులో శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చాక రాజకీయ నాయకుడిగా, పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. తాజాగా తన చేష్టలతో ప్రజలను భయపెడుతున్నాడు.
మాజీ సర్పంచ్ క్షుద్రపూజలు…వీడియో వైరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అన్నం రాసులపై మాంసం,… pic.twitter.com/rwoOjsuzkk
— ChotaNews App (@ChotaNewsApp) December 7, 2025