Bigg Boss Telugu Winners: గత కొన్ని సంవత్సరాల కిందటి నుంచి టెలివిజన్ రంగం లో పెను మార్పులు వచ్చాయి. సీరియల్స్ ని చూడడానికి ఇష్టపడని జనాలు రియాల్టీ షోల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక దానిని క్యాచ్ చేసుకోవడానికి పలు టీవీ ఛానెళ్లు రియాలిటీ షో లను ప్లాన్ చేశాయి…ఇక అందులో భాగంగా వచ్చిందే బిగ్ బాస్ షో… ఇక ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదోవ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది…ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో పాల్గొని గెలిచిన 8 మంది కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు… గెలవడం వల్ల వాళ్లకు డబ్బులైతే వస్తున్నాయి. కానీ వాళ్ల కెరియర్ పరంగా ఏమైనా యూస్ ఉంటుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
బిగ్ బాస్ షో సీజన్ వన్ టైటిల్ విన్నర్ అయిన ‘శివ బాలాజీ’ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ షో కి రాకముందు పలు సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శివ బాలాజీ…ఒక్కసారి బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఆ మాత్రం కూడా సినిమాల్లో కనిపించడం లేదు… మరి బిగ్ బాస్ షో వల్ల అతని కెరీర్ కి హెల్ప్ అయితే అవ్వలేదు…
బిగ్ బాస్ షో సీజన్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచాడు. షోకి రావడానికి ముందు ఆయన పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తు నటుడిగా చాలా మంచి బిజీగా ఉండేవాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకు చాలా క్రేజ్ ఉందని అనుకున్న కౌశల్ సినిమా హీరోగా నటించి నటుడిగా ఏమాత్రం రాణించలేకపోయాడు. దాంతో అటు సీరియల్స్ చేయలేక, ఇటు సినిమాల్లో అవకాశాలు రాక ఖాళీగా ఉంటున్నాడు…
బిగ్ బాస్ షో సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈయన పలు పాటలు పాడుతూ చాలా మంచి పాపులారిటినైతే సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో నాటు నాటు అనే సాంగ్ అయితే పాడాడు. ఒక రకంగా బిగ్ బాస్ అనేది ఈయన ఒక్కడికే కొంతవరకు హెల్ప్ అయిందనే చెప్పాలి… ఇక రీసెంట్ గా ఆయన హరిణ్యా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తొందర్లోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు…
ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అభిజిత్ బిగ్ బాస్ కు వెళ్లక ముందు పలు సినిమాలు వెబ్ సిరీస్ లను చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాడో అప్పటినుంచి ఇప్పటివరకు ఒక వెబ్ సిరీస్ ను కూడా చేయలేకపోయాడు…
ఇక బిగ్ బాస్ షో ఐదోవ సీజన్ లో విజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. మరి ఇప్పటివరకు ఈ షో ద్వారా ఆయన మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ‘ఆన్ స్టపబుల్’ అనే సినిమాలో హీరోగా చేశాడు. అయినప్పటికి ఆ సినిమా సక్సెస్ ని సాధించకపోవడంతో మరోసారి తను సీరియల్స్ చేసే బాటలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక బిగ్ బాస్ షో సీజన్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. మరి సింగర్ రేవంత్ అంతకు ముందు చాలా మంచి పాటలు పాడినప్పటికి ఈ మధ్యకాలంలో ఆయన పాడిన పాటలు పెద్దగా పాపులారిటీని సంపాదించుకోవడం లేదు…
బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. మరి అప్పటినుంచి పల్లవి ప్రశాంత్ రీల్స్ కూడా చేయడం లేదు. తన పరిధి పెరిగిందని తను పెద్ద సెలబ్రిటీని అయ్యానని అనుకున్నప్పటికి ఆయన సాధించిన విజయం వల్ల అతని కెరియర్ పరంగా పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు…
ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అంతకుముందు పలు సీరియల్స్ లో హీరోగా నటించిన నిఖిల్ ప్రస్తుతం సీరియల్స్ నే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
ఇక బిగ్ బాస్ షో వల్ల యాజమాన్యానికి భారీగా లాభాలైతే వచ్చాయి. కానీ కంటెస్టెంట్లుగా పాల్గొన్న వాళ్లకి విన్నర్స్ గా నిలిచిన వాళ్ళకి సైతం ఈ షో వాళ్ల కెరీర్ లో గ్రోత్ అయితే సంపాదించి పెట్టలేదనే చెప్పాలి…