https://oktelugu.com/

Nuvve Kavali Movie : ‘నువ్వేకావాలి’లోని తరుణ్ లవర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అయితే వర్ష మరోసారి సినిమాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం రావడం లేదు. కానీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రెండోసారి అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి. 

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2024 / 01:30 PM IST

    Nuvve Kavali

    Follow us on

    Nuvve Kavali Movie : సినిమాల్లో ఒక్క అవకాశం వచ్చినా చాలు.. తమ ప్రతాపం చూపిస్తామని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే  సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ హీరో, హీరోయిన్ అవుదామని అనుకుంటారు. అందమైన రూపంతో పాటు కెమెరా ఫీయర్ లేకపోవడంతో హీరోయిన్ కావొచ్చని అనుకుంటారు. కానీ అదృష్ట రేఖ సరిగ్గా లేకపోవడంతో సైడ్ పాత్రలకే పరిమితం అవుతారు. అయితే తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారున్నారు. వారిలో వర్ష ఒకరు. పలు సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన వర్ష ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.
    సినిమాల్లో హీరోయిన్ కాకపోయినా వర్షకు ఆ రేంజ్ లో  పాపులారిటీ ఉంది. ఈమె అసలు పేరు మాధవి.  సినిమాల్లోకి వచ్చాక వర్ష గా మార్చుకుంది. తరుణ్ హీరోగా వచ్చిన ‘నువ్వే కావాలి’ అనే సినిమా గురించి అందిరికీ తెలిసిందే. ఈ సినిమాలో తరుణ్ ప్రేమికురాలిగా వర్ష అలరిస్తుంది. అంతకుముందు పలు సినిమాల్ల నటించిన ఇక్కడి నుంచే ఆమె కెరీర్ మొదలైందని చెప్పవచ్చు.  ఇందులో ఆమె కొన్ని పదాలను స్పష్టంగా పలకలేక ప్రేక్షకులను నవ్విస్తుంది. ఆ తరువాత  పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాలో పవన్ సోదరుడు అచ్యుత్ లవర్ గా వర్ష చక్కగా నటించారు.
    మొదట్లో సీరియల్స్ లో నటించి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాక.. చాలా మంది ఆమెకు హీరోయిన్ గా అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఉండిపోయింది. వర్ష సినిమాల్లో నుంచి తప్పుకున్నాక.. తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే తనకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. తాజాగా ఈమె సాంప్రదాయ చీరలో అలరిస్తోంది. అందం విషయంలో అప్పటికీ, ఇప్పటికీ తగ్గేదేలే అన్నట్లుగా ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
    అయితే వర్ష మరోసారి సినిమాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం రావడం లేదు. కానీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రెండోసారి అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.