Harish Shankar’s Mr. Bachchan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మంచి సినిమాలు చేసి డైరెక్టర్లుగా తమ ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక కమర్షియల్ సినిమా డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. నిజానికి కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడంలో ఉన్నంత ప్రీ నెస్ కమర్షియల్ సినిమాల్లో ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. వాటిని అధిగమిస్తూ ప్రేక్షకుడి ఆలోచన ధోరణి కి రీచ్ అయ్యేవిధంగా కొత్త కథాంశంతో కమర్షియల్ సినిమాలు చేసి మెప్పించడం అనేది ఒకరకం గా కత్తి మీద సాము లాంటిది.
ఇక ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ సినిమాని అలవోకగా తీసి విజయం సాధించవచ్చు అని తెలియజేసిన ఒకే ఒక దర్శకుడు హరీష్ శంకర్. ఈయన సినిమాలో హీరో డాన్స్ లు వేస్తూ, ఫైట్లు చేస్తూ,భారీ డైలాగు లు చెబుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. అందువల్లే ఈయన పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మ్యనరిజమ్స్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ గాని, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రవితేజతో మొదలుపెట్టిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా షూటింగ్ కూడా సగం కంటే ఎక్కువగా కంప్లీట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందట. ఇక దానికోసం పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కి రవితేజ అంటే చాలా ఇష్టం…
ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో నటించాలని కూడా తను సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తను ఒక ఐదు నిమిషాల పాత్ర కూడా పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఉంటే ఈ సినిమా వెయిటేజ్ అనేది భారీగా పెరుగుతుందనే ఒకే ఒక కాన్సెప్ట్ తో హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…