Homeఎంటర్టైన్మెంట్Naveen Polishetty: అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన హీరో నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty: అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన హీరో నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురయ్యాడన్న న్యూస్ కలకలం రేపుతోంది. అమెరికాలో ఈ ప్రమాదం జరిగిందట. బైక్ పై వెళుతున్న నవీన్ కి యాక్సిడెంట్ జరిగిందట. దాంతో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయ్యిందట. రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. అయితే నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.

నవీన్ పోలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఈ మూవీలో రిచ్ కిడ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. డీ ఫర్ దోపిడీ, వన్ నేనొక్కడినే చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కొన్ని టెలివిజన్ సిరీస్లలో నటించాడు. నవీన్ హిందీ అనర్గళంగా మాట్లాడగలడు. ఈ క్రమంలో హిందీ టెలివిజన్ సిరీస్లు చేశాడు.

బాగా గ్యాప్ ఇచ్చి 2019లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అదే ఏడాది ఛిచ్చోరే అనే హిందీ చిత్రం చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సపోర్టింగ్ రోల్ చేయడం విశేషం.

జాతిరత్నాలు మూవీ నవీన్ పోలిశెట్టికి బ్రేక్ ఇచ్చింది. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశాడు. ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ వసూళ్ల వర్షం కురిపించింది. నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు చిత్రంతో ఫేమ్ రాబట్టాడు.

గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ మిసెస్ పోలిశెట్టి చిత్రంతో అలరించాడు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించడం విశేషం. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ రోల్ చేశాడు ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి ప్రకటించాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఈ ప్రమాద వార్తలు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version