Ram Charan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా ప్రతి ఒక్కరు తమదైన రీతిలో పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటూ సినిమాగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా స్టాండర్డ్ అనేది కూడా చాలా బాగా పెరిగిపోయింది. ఇక లో క్వాలిటీ లో సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. కాబట్టి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించి సక్సెస్ లను అందుకొని ఆ తర్వాత ప్రొడ్యూసర్లు మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. మరి మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ప్రస్తుతం తనదైన రీతిలో బిజినెస్ ని భారీ రేంజ్ లో చేసుకోవాలనే ప్రణాళికలను రచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి తో సినిమా చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం పోటీ పడుతున్నారు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక రాజమౌళితో సినిమా చేస్తే భారీ సక్సెస్ అయితే దక్కుతుంది కానీ ఆయనతో సినిమా చేసిన హీరోలు ఆ తర్వాత తమ సినిమాలతో ఫ్లాపులను మూట గట్టుకుంటారు అనే ఒక నమ్మకమైతే ఉంది. మరి రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఎవరు ఆ బ్యాడ్ రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోతున్నారు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఆ రికార్డును బ్రేక్ చేశారనే చెప్పాలి. దేవర సినిమా సక్సెస్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత చేసిన సినిమా ఇదే కావడం వల్ల ఆయన మీద ఉన్న ఆ బ్యాడ్ రికార్డుని జూనియర్ ఎన్టీఆర్ తొలగించాడు.
అలాగే ఆయన కూడా ఒక పెద్ద గండాన్ని దాటి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఆయన ఈ గండాన్ని దాటుతాడా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక కొంతమంది మాత్రం రామ్ చరణ్ ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో నటించాడు.
ఆ సినిమా ప్లాప్ అయింది కాబట్టి ఆయన ఆ గండాన్ని దాటలేకపోయాడు. ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అని కొంతమంది అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆయన ఆచార్య సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆ బ్యాడ్ రికార్డు అనేది వర్తించే అవకాశం అయితే లేదు.ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ కొట్టిన ఫెయిల్యూర్ సాధించిన కూడా అది రాజమౌళి ఖాతాలోకి అయితే వెళ్ళదు. కాబట్టి ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ఆయన అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…