https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ కూలీ మూవీలో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

తెలుగులో చాలామంది నటులు తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు తెలుగులో కూడా భారీ మార్కెట్ ను అయితే ఏర్పాటు చేసుకున్నారు...

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 04:24 PM IST

    Rajinikanth Coolie

    Follow us on

    Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన చాలా తక్కువ సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. మొత్తానికైతే ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తన పేరుని ఉన్నత శిఖరాలకు తెలియజేసేలా చేస్తూ ఉంటాయి. గత సంవత్సరం జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన పాన్ ఇండియాలో కూడా తన మార్కు చూపించాడు. ఇక ప్రస్తుతం ‘వేట్టయన్ ‘ సినిమాతో మరోసారి మన ముందుకు వస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ రజనీకాంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక దాంతోపాటుగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే స్టార్ డమ్ ని దక్కించుకోవడమే కాకుండా తనను తాను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కూడా చూస్తున్నాడు. అయితే ఇందులో మాఫియా డాన్ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటిస్తూ ఉండడం విశేషం…

    ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది గొప్ప నటులు కూడా నటిస్తున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ ఒకప్పుడు చేసిన ముత్తు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక అందులో ‘తిలానా తిలానా’ సాంగ్ కూడా అందరికీ ఫేవరెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఆ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక లోకేష్ కనకరాజ్ గురించి చూసుకుంటే ఆయన ఏ హీరో అయితే సినిమా చేస్తున్నాడో ఆ హీరో సినిమాలోని మేనరిజమ్స్ ని గాని, ఓల్డ్ సాంగ్స్ ని గాని తీసుకొని వాటిని రీమిక్స్ చేసి మళ్లీ ఆడియన్స్ కి కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక విక్రమ్ సినిమాలో కూడా ఇలాంటిదే జరిగింది. అలాగే లియో సినిమాలో కూడా ఇలాంటి జిమ్మిక్కులను చేశాడు.

    మొత్తానికైతే ఆయన సినిమాని సక్సెస్ చేయడానికి సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో అలాంటి ఎలిమెంట్స్ ని సినిమాలో పొందుపరిచి మరి ఆ సినిమాని తెరకెక్కిస్తూ ఉంటాడు. అందుకే లోకేష్ కనకరాజ్ కి పాన్ ఇండియాలో భారీ గుర్తింపు అయితే ఉంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక మ్యాజిక్ ను చేయాలని లోకేష్ కనకరాజ్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…