https://oktelugu.com/

Matka Movie Trailer : మట్కా మూవీ ట్రైలర్ చూస్తుంటే ఆ సూపర్ హిట్ సినిమాను చూస్తున్నట్టే అనిపిస్తుందిగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన వేసిన బాటలోనే మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తుందనే విషయం మనకు తెలిసిందే...ఇక మెగా బ్రదర్ నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:45 PM IST

    Matka Movie Trailer

    Follow us on

    Matka Movie Trailer : మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లో దాదాపు ఆరుగురు హీరోలు ఉన్నారు. ఇక మెగా ప్రిన్స్ గా పిలవబడుతున్న వరుణ్ తేజ్ వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తున్నప్పటికి ఆయనకు ఒక్క సక్సెస్ అయితే దక్కడం లేదు. ఫిదా సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత పెద్దగా సక్సెసుల నైతే సాధించలేకపోతున్నాడు… ఇక ఎట్టకేలకు పలాస సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ ని కనక మనం చూసినట్లైతే ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ప్రతో ఏజ్ గ్రూప్ లో తనను తాను మార్చుకున్న విధానం చాలా బాగుంది. ఇక ప్రతి ఎపిసోడ్ ను ఆయన ఓన్ చేసుకొని మరి నటించినట్టుగా కూడా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా కరుణకుమార్ లాంటి ఒక టెస్ట్ ఉన్న దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అంటే వరుణ్ తేజ్ చాలా మంచి సినిమా చేస్తున్నాడనే చెప్పాలి.

    ఇంకా మొత్తానికైతే ఈ సినిమా మొత్తం మాఫియా మీదనే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎర్రచందనం మాఫియాను బేస్ చేసుకొని పుష్ప సినిమాను తెరకెక్కించారు. మట్కా మాఫియాను ని బేస్ చేసుకొని ఈ మట్కా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో కూడా డబ్బుల కోసం తాపత్రయ పడే ఒక పేద వ్యక్తి గా కనిపించి ఆ తర్వాత మట్కా సామ్రాజ్యానికి అధిపతిగా మారబోతున్నట్టుగా చూపించినట్టుగా తెలుస్తోంది.

    మరి ఈ సినిమా స్టోరీ ని కనక చూసినట్లైతే మనకు పుష్ప సినిమా స్క్రీన్ ప్లే నే కనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో కూడా తను అంచెలంచెలుగా ఎదుగుతూ ఎలా వచ్చాడనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి పుష్ప సినిమా లైన్ తోనే తెరకెక్కుతున్నప్పటికి ఈ మూవీ బ్యాగ్ డ్రాప్ వేరు ఆ మూవీ బ్యాక్ డ్రాప్ వేరు గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఒకవేళ పుష్పకు ఈ సినిమాకు కనక దగ్గరి పోలికలు ఉన్నట్లైతే ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా వరుణ్ తేజ్ కు ఒక మంచి సక్సెస్ వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఉవ్వుల్లూరుతున్నారు. మరి ఈ సినిమాతో అయిన తను అనుకున్న సక్సెస్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…