https://oktelugu.com/

Kubera Movie : కుబేర నుంచి టీజర్ రానుందా..? ఆ టీజర్ లో ఏం చూపించబోతున్నారంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ డైరెక్టర్లు గా వెలుగొందుతున్న క్రమంలో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు మాత్రం తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:54 PM IST

    Kubera Movie

    Follow us on

    Kubera Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకి డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక టేస్ట్ ఉన్న దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం… ఎందుకంటే ఆయన సినిమాల్లో చిన్నపిల్లలు, వర్షం, క్రికెట్, ఫ్యామిలీ వాటి మీదనే ఆయన ఒక డ్రామా ని క్రియేట్ చేసి ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అందువల్లే శేఖర్ కమ్ములను మిగతా దర్శకులతో పోల్చలేము. ఇక ఆయనకంటూ సపరేట్ ఒక ప్రపంచం ఉందనే చెప్పాలి. ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం కోసం ఆయన ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనకి చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. దర్శకుడిగా తనను తాను స్టార్ లెవెల్లో ఎలివేట్ చేసుకోలేకపోయినా కూడా ఆయన సినిమాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. కానీ ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును పొందుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

    ఇక ఇందులో నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరొకసారి సినిమా ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ముస్తబ్ అవుతున్నాడు. ఇక ధనుష్ కూడా తెలుగు మార్కెట్ మీద కన్ను వేశాడు. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ధనుష్ లాంటి నటుడు మన సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.

    మన దర్శకులు కూడా రాసుకున్న క్యారెక్టర్ ని ఆయన యాక్సెప్ట్ చేసి దానికి ఒక రూపం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నాడు. ఇంకా ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈనెల 15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

    అయితే టీజర్ లో ఏం ఉండబోతుంది అంటే మెయిన్ గా ధనుష్, నాగార్జున ను ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి డబ్బుకి మధ్య సంబంధం ఎలా ఉండబోతుందనేది ఇందులో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి టీజర్ తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి శేఖర్ కమ్ముల చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు…