https://oktelugu.com/

Prashanth Neel :ప్రశాంత్ నీల్ కి భారీ ఎదురు దెబ్బ తగిలిందా..? మరి ఎన్టీయార్ సినిమా పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. పాన్ ఇండియా సినిమాలు రావడంతో ఏ భాషలో సినిమాలు చేసినా కూడా అన్ని సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతూ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయా సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ ముందుకుసాగడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:42 PM IST

    Prashanth Neel

    Follow us on

    Prashanth Neel :  కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా తన సినిమాలతో మ్యాజిక్ ని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన కథ మాటలు అందించిన భఘీర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంగేజ్ చేయకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ ని మూటగట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అసలు ఎంగేజ్ చేయడం లేదంటూ ఈ సినిమాను చూసిన కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకి ఏమాత్రం హైప్ లేకుండా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకి భారీగా మైనస్ అయింది. ఇక దాంతోపాటుగా ఈ సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తి గొలిపే అంశాలు కూడా ఏమి ట్రైలర్ లో రిలీజ్ చేయలేదు. దానివల్ల ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అయిందనే విషయాన్ని కూడా అందరూ మర్చిపోయారు. ఇక దానికి తగ్గట్టుగా దీపావళి కానుక వచ్చిన క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో బఘీర సినిమాకి భారీ ఎఫెక్ట్ అయితే పడుతుంది.

    ఇక ఏది ఏమైనాప్పటికి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా మీద భారీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటూ చాలా పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఇక ఈ సినిమా వల్ల ప్రశాంత్ నీల్ కి ఏదైనా ఇబ్బంది కలిగి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ మాత్రమే వాటిని పట్టించుకోకుండా తను చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ మొత్తాన్ని బయటికి తీసి ఒక భారీ రేంజ్ లో అతన్ని చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సలార్ సినిమాలో ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే ప్రభాస్ ని ఎలివేట్ చేశాడో డ్రాగన్ సినిమాలో కూడా ఎన్టీఆర్ ని అలాంటి ఒక యాక్షన్ బ్యాగ్రౌండ్ లో చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…