Deputy CM Pawan Kalyan : విజయవాడ – హైదరాబాద్ మధ్యలో భారీ ఫిల్మ్ స్టూడియోస్ కి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

దశాబ్దాల తరబడి హైదరాబాద్ లో ఉంటున్న వారు, అన్నీ వదులుకొని ఒకేసారి ఆంధ్ర ప్రదేశ్ షిఫ్ట్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీ ని ఇక్కడికి వెంటనే తీసుకొని రాలేకపోయినా, కనీసం ఫిలిం స్టూడియో ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ అభిలాష.

Written By: Vicky, Updated On : August 18, 2024 4:31 pm

pawan Kalyan Meet Producers

Follow us on

Deputy CM Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే ఎన్ని మార్పులు చూసామో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాది పడిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిల్చింది. రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లో 50 వేల కోట్ల రూపాయలకు పైగానే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఇంత మంచి రోజులు రావడానికి కారణం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ఈ కూటమి కట్టకపోయ్యుంటే నేడు ఇలాంటి పనులు జరిగేవి కావు. ఉపముఖ్యమంత్రి స్థానం లో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగోగులు కోసం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

దశాబ్దాల తరబడి హైదరాబాద్ లో ఉంటున్న వారు, అన్నీ వదులుకొని ఒకేసారి ఆంధ్ర ప్రదేశ్ షిఫ్ట్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీ ని ఇక్కడికి వెంటనే తీసుకొని రాలేకపోయినా, కనీసం ఫిలిం స్టూడియో ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ అభిలాష. రీసెంట్ గానే సినీ నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ ని విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్ లో కలిసి ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భేటీలో ఇండస్ట్రీ కి సంబంధించి ఎన్నో విషయాలను చర్చించారు. టికెట్ రేట్స్ మీద శాశ్వత పరిష్కారం తో పాటుగా, సినీ స్టూడియో గురించి కూడా చర్చలు నడిచాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడ, హైదరాబాద్ కి మధ్యలో భారీ ఎత్తున ఫిలిం స్టూడియోస్ కోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో భూ సమీకరణ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ ఫిలిం స్టూడియో కి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నాడట పవన్ కళ్యాణ్.

గతం లో మాజీ సీఎం జగన్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు భూములను తీసుకొని ఫిలిం స్టూడియో కట్టించాలని చూసాడు. కానీ ఈ ఫిలిం స్టూడియో కి సంబంధించిన లాభాలు మొత్తం ప్రభుత్వానికే ఇవ్వాలట, సురేష్ బాబు కి కేవలం నెల అద్దె మాత్రమే ఇస్తామని చెప్పారట. అందుకు సురేష్ బాబు ఒప్పుకోలేదు, దీంతో పగబట్టిన మాజీ సీఎం, సినీ ఇండస్ట్రీ మొత్తం తన కాళ్ళ దగ్గర ఉండాలనే ఉద్దేశ్యంతో అప్పటి వరకు ఉన్న టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించి ఇండస్ట్రీ ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ సమయంలో చిరంజీవి పెద్ద మనసు చేసుకొని మాజీ సీఎం జగన్ ని కలిసి ఈ సమస్య కు ఒక తాత్కాలిక పరిష్కారం తెచ్చాడు. ఈ భేటీ లో చిరంజీవితో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలా సినీ హీరోలు టికెట్ రేట్స్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరగకుండా, స్వతంత్రులు అయ్యేందుకు ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేర్పులు చెయ్యబోతున్నాడు.