Prabhas marriage: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తాయి. ఇక ఆ మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. కాబట్టి వాళ్ళ సినిమాలు విజువల్ గా కూడా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంటాయి. అందువల్లే అతని సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రేక్షకులంతా ఆసక్తిని చూపిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ‘బాహుబలి 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన పాన్ ఇండియా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి భారీ రికార్డులను కొల్లగొట్టిన హీరోగా ప్రభాస్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇక ఇలాంటి ప్రభాస్ ఒకానొక సమయంలో చాలా బ్యాడ్ పేస్ ని అనుభవించాడు. అదేంటి అంటే వాళ్ళ నాన్న సూర్యనారాయణ రాజు చనిపోయినప్పుడు తను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారట.
వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు ధైర్యం చెప్పినప్పటికి ప్రభాస్ కి ఏదో కోల్పోయాను అనే బాధ గుండెలో ఉండేది. ఇక అదే సమయంలో అతను చేసిన సినిమాలన్నీ కూడా ప్లాప్ అవ్వడంతో మానసికంగా అతన్ని దెబ్బతీసింది. అదే సమయంలో తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికి వీటన్నింటిని చూసిన తర్వాత ఆయన కెరియర్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలే అని లైట్ తీసుకున్నారట.
Also Read: ఆ ఒక్క కారణం తో సందీప్ రెడ్డి వంగ కి నో చెప్పిన ఇద్దరు హీరోలు…
దాని తర్వాత ఆయన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధించినప్పటికి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేక అప్పటినుంచి ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటున్నాడు. ఇక ఫ్యూచర్లో ఆయన పెళ్లి చేసుకుంటాడా? లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో తన అభిమానులు కొంత వరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో రాజసాబ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…