Gaza Peace Summit : ప్రపంచమంతా సంబరాలు చేసుకునే రోజు ఇదీ.. గాజా శాంతి ఒప్పందం ఒక చారిత్రాత్మకమైనదిగా నిలిచింది. అటు ముస్లిం దేశాలు, ఇటు ఇజ్రాయెల్ అన్నీ కలిపి ఏకాభిప్రాయంతో శాంతికి ఉద్యమించిన రోజు. శతాబ్ధాలుగా కొనసాగిన ఈ యుద్ధం ఇలా ముగియడం ఆనందాన్ని ఇస్తోంది.
శతాబ్ధాల కొట్లాటకు తెరపడింది. నైతికంగా ఇదీ ఇజ్రాయెల్ కు విజయం. పాలస్తీనాకు మంచి భవిష్యత్తు ఉండనుంది. 1948న ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఐక్యరాజ్యసమితీ గుర్తించింది. అయితే ఇజ్రాయెల్ ను ఇస్లాం దేశాలు గుర్తించకుండా.. అన్నీ కలిసి యుద్ధం చేశాయి. ఇజ్రాయెల్ ను అంతం చేశాయని చూశాయి.
ఒకటి కాదు రెండు మూడు యుద్ధాలు జరిగాయి. అన్నింట్లోనూ ఇజ్రాయెల్ గెలిచి భూమిని సంపాదించింది. ఇజ్రాయెల్ ఇక ఎప్పటికీ ఓడించలేమని ఈజిప్ట్ ఏకంగా ఇజ్రాయెల్ ను గుర్తించాయి.
అయితే అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ను గుర్తించలేదు. కానీ ట్రంప్ వచ్చాక యూఏఈ సహా కొన్ని దేశాలు గుర్తించడం మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్ ఉనికి తాజాగా ‘గాజా శాంతి ఒప్పందం’ మరోసారి చాటుకుంది. నిజమైన శాశ్వత ప్రకటన ఇజ్రాయెల్ కు నైతిక విజయంగా చెప్పొచ్చు. ఒక్క ఇరాన్ తప్పితే మిగతా ముస్లిం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ను దేశంగా ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కు ఇది ఘన విజయం.
ప్రపంచమంతా గాజా శాంతి ఒప్పందంపై సంబరాలు చేసుకుంటుంటే పాకిస్తాన్ లో మాత్రం అల్లర్లు జరుగుతున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.