OG Prakash Raj Character: మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ'(They call Him OG) ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం లోని క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. నిన్ననే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్ క్యారక్టర్ ని ‘అర్జున్’ గా ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే నేడు ఈ చిత్రం లో మరో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ని కూడా పరిచయం చేశారు. ఇందులో ఆయన క్యారక్టర్ పేరు సత్య దాదా. అయితే ప్రకాష్ రాజ్ ని ఈ సినిమాలో తీసుకోవడం పై అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…
ఎందుకంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై ఈమధ్య కాలం లో చాలా దారుణమైన కామెంట్స్ చేసాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియా లో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఆయనతో కలిసి ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ నటించడం అభిమానులకు ఇష్టం లేదు. ఆయన బదులుగా వేరే ఆర్టిస్టు తీసుకొని ఉండుంటే బాగుండేది అంటున్నారు. కానీసం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నెగటివ్ క్యారక్టర్ చేసుంటే, ఆయన్ని పవన్ కళ్యాణ్ కొట్టుంటే అభిమానులు సంతృప్తి చెందేవారు. కానీ ఇందులో ప్రకాష్ రాజ్ కి మంచి పాజిటివ్ క్యారక్టర్ ఇచ్చారట. ఇది అభిమానుల్ని మరింత నిరాశకు గురి చేసిన విషయం. సెప్టెంబర్ 25 న ఓజీ లో ప్రకాష్ రాజ్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే భయపడుతున్నారు థియేటర్స్ యాజమాన్యం భయపడుతుంది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 21 న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ విడుదల రోజునే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చిన్నగా ఇప్పుడిప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవుతున్నాయి. వీకెండ్ లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని పూర్తి స్థాయిలో మొదలు పెడతారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ని కూడా అధికారికంగా తెలియజేయనున్నారు మేకర్స్.