Uppal Balu Dance: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది స్వీయ ప్రాచుర్యం పొందుతున్నారు. తద్వారా దండిగా సంపాదిస్తున్నారు. అటువంటి వారిలో ఉప్పల్ బాలు కూడా ఒకడు. వినూత్నమైన డ్యాన్సులతో అతడు అలరిస్తుంటాడు. కొంతమంది అతడి వ్యవహార శైలిని తప్పు పడుతుంటారు. బండ బూతులు తిడుతుంటారు. అయినప్పటికీ ఉప్పల్ బాలు తన శైలి మార్చుకోడు. తన దారి తనదే. తాను సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయినప్పటికీ కొన్ని విధానాలను పాటించడంలో ఉప్పల్ బాలు ముందుంటాడు. అప్పట్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు అతడిని సంప్రదించారు. భారీగా డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ అతడు ప్రచారం చేయలేదు. ఈ విషయంలో చాలామంది నెత్తి మాసిన సెలబ్రిటీల కంటే ఉప్పల్ బాలు చాలా నయం.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…
ఉప్పల్ బాలు హైదరాబాద్ రోడ్లమీద రీల్స్ చేస్తూ ఉంటాడు. పక్కన ఉన్న జనం ఏమనుకుంటారు.. తనను ఎలా ట్రీట్ చేస్తారు.. అనే విషయాలను ఏమాత్రం పట్టించుకోడు. విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని అలరిస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటాడు. అందువల్లే అతనిని చాలామంది అనుసరిస్తుంటారు. కొంతమంది దారుణంగా విమర్శిస్తుంటారు. అయినప్పటికీ ఉప్పల్ బాలు తన ధోరణి మార్చుకోడు. పైగా విచిత్రమైన గెటప్స్ వేస్తూ ఆకట్టుకుంటాడు.. ఇటీవల వైజాగ్ సత్య, బెంగళూరు బుజ్జి, టిక్ టాక్ దుర్గారావు వంటి వారితో వివిధ ప్రాంతాలను సంచరిస్తున్నాడు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్నట్టుండి ఉప్పల్ బాలు సందడి చేశాడు. ఆ ప్రాంతంలో రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో దేవకన్య మాదిరిగా డ్రెస్సు ధరించి ఉప్పల్ బాలు మెరిశాడు. ఒక్కసారిగా వాహనదారులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది ఏమో ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోను ఉప్పల్ బాలు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో రకరకాలుగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. ఇంతమందిని నవ్విస్తున్న ఉప్పల్ బాలుకు ధన్యవాదాలు తెలిపారు.
Why should I suffer alone..
Uppal Balu dance recording on Kukatpally road, Hyderabad. pic.twitter.com/czeUWyZPuI
— (@Sagar4BJP) September 18, 2025