Balagam Venu: బలగం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు జబర్దస్త్ కమెడియన్ వేణు. దర్శకుడిగా పెద్ద అనుభవం లేకున్నా బలగం మూవీతో సంచలన విజయం సాధించాడు. బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి ప్రజల బంధాలు, ఆప్యాయతలను చాలా సహజంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు వేణు. జబర్దస్త్ వేణు కాస్తా బలగం వేణుగా మారాడు. ప్రస్తుతం వేణు నేచురల్ స్టార్ నాని తో మూవీ చేయబోతున్నాడని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజాగా బలగం వేణు తన స్నేహితుడు కమెడియన్ ధనరాజ్ తో కలిసి ఆలీతో సరదాగా షో కి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ క్రమంలో తనకు ఎదురైన అవమానం గురించి ఆలీ ముందు బయటపెట్టాడు. వేణు మాట్లాడుతూ .. నేను 2003 లో నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాను. 2023 లో డైరెక్టర్ అయ్యానని వేణు అన్నారు. దీంతో మూడు బాగా కలిసొచ్చింది అని ఆలీ అన్నారు.
బాగా కలిసొచ్చింది కానీ .. దానికి 20 ఏళ్ళు పట్టింది అని వేణు తెలిపారు. ఈ క్రమంలో ఆలీ కమర్షియల్ చిత్రాలు రాణిస్తున్న టైములో బలగం లాంటి పల్లెటూరి భావోద్వేగాలతో కూడిన సినిమా చేయడానికి కారణం ఏంటని ఆలీ అడిగారు. వేణు చెప్పిన సమాధానం ప్రోమో చూపించలేదు. కానీ బలగం సమయంలో తనకు ఎదురైన అవమానం గురించి వేణు చెప్పుకొచ్చాడు. సినిమా మేకింగ్ లో టెక్నిషియన్స్ తో చర్చలు జరుగుతుంటాయి.
ఈ క్రమంలో ఓ టెక్నిషియన్ అన్నాడు .. ఏదో పెద్ద బాహుబలి తీస్తున్నట్లు ఫీల్ అవుతున్నావ్ అంటూ అవమానించాడు. బలగం రిలీజ్ అయినప్పుడు మీరు(ఆలీ) చూసి ఇది చిన్న సినిమాల్లో ఇది చాలా బాగుంది అన్నారు. అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని వేణు వెల్లడించారు. ఇక ధనరాజ్ కూడా దర్శకుడిగా ఓ మూవీ తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఎపిసోడ్ వచ్చే మంగళవారం ఈటీవీలో ప్రసారం కానుంది.
