గిల్డ్ పెద్దలూ.. ఈ లోపు సినిమా చచ్చిపోతుంది ?

టాలీవుడ్.. ఎప్పటినుండో ఓ ఆరోపణ ఉంది. తెలుగు సినిమాలకు ఆ నలుగురే పెద్ద దిక్కు అని, ఎందుకంటే… ధియేటర్లన్నీ ఆ నలుగురు చేతిలోనే ఉంటాయి అని. ఇక ఆ నలుగురిలో దిల్ రాజు కూడా ఒకరు. ఇన్నాళ్లు ఇలా ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా.. వాటిల్లో ఎక్కడో లొసుగులు ఉండేవి. కానీ, ఈ సారి దిల్ రాజు పై తెలంగాణలో మరో పంపిణీదారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి […]

Written By: admin, Updated On : January 15, 2021 11:05 am
Follow us on


టాలీవుడ్.. ఎప్పటినుండో ఓ ఆరోపణ ఉంది. తెలుగు సినిమాలకు ఆ నలుగురే పెద్ద దిక్కు అని, ఎందుకంటే… ధియేటర్లన్నీ ఆ నలుగురు చేతిలోనే ఉంటాయి అని. ఇక ఆ నలుగురిలో దిల్ రాజు కూడా ఒకరు. ఇన్నాళ్లు ఇలా ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా.. వాటిల్లో ఎక్కడో లొసుగులు ఉండేవి. కానీ, ఈ సారి దిల్ రాజు పై తెలంగాణలో మరో పంపిణీదారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరీ, కచ్చితమైన నిజాలు చెబుతూ దిల్ రాజును కాస్త, కిల్ రాజును చేశాడు. శ్రీను మాటల్లో.. ‘ఆయన దిల్ రాజు కాదు.. కిల్ రాజు. తెలుగు సినిమాలను కిల్ చేసేస్తున్నాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు.

Also Read: శుభాకాంక్షలతో ‘మోసగాళ్లు’ న్యూ పోస్టర్

అసలు వీళ్ల మధ్య వివాదం ఎందుకు వచ్చిదంటే.. రవితేజ ‘క్రాక్’ను వరంగల్ శ్రీను తీసుకున్నారు. దిల్ రాజు ‘రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్’ సినిమాలను తీసుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, దిల్ రాజు అనే వ్యక్తి నైజాంలో థియేటర్స్ ‌పై ఒక నియంత పాలన చేస్తూ.. పెత్తనం చెలాయిస్తున్నారని, మంచి ఆదరణ లభిస్తున్న క్రాక్ సినిమాను థియేటర్ల్ నుంచి తీసేస్తున్నారని చెప్పుకొచ్చాడు శ్రీను. అయితే వరంగల్ శ్రీను ఈ విషయంలో ఓ పార్టీ లీడర్ ను, అలాగే ఉస్మానియా జేఏసి తో కూడా తెరవెనుక సంప్రదింపులు జరిపాడట. దాంతో దిల్ రాజు పై ఒత్తిడి తేవాలని శ్రీను ప్లాన్.

Also Read: సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ పాత్ర‌లతో.. !

కాగా ఈ విషయంలో శ్రీను తొందరపడ్డాడు అని, అయినా ఇండస్ట్రీ జనాలతో సమస్యలు వస్తే, మనం మనం చూసుకోవాలి కానీ, బయటవాళ్లను ఇన్ వాల్వ్ చేయడం ఎంత వరకు సమంజసం ? అని గిల్డ్ పెద్దలు అంటున్నారట, అయినా మనం మనం చూసుకుని చర్చించుకునే లోపు సినిమా చచ్చిపోతుంది కదా. మరి ఈ విషయం ఆ గిల్డ్ పెద్దలకు తెలియదా ? అయినా ఇండస్ట్రీలో న్యాయం జరిగితే.. తమ బిజినెస్ ను పోగొట్టుకుని.. ఎందుకు బయటవాళ్లను తీసుకువస్తారు పంపిణీ దారులు ? అసలు ఇలాంటి వ్యవహారాలు భవిష్యత్తులో కూడా జరగకుండా పెద్దలు ఎందుకు చెక్ చెప్పాలని అనుకోవడంలేదో.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్