https://oktelugu.com/

హానీమూన్ కోసం మంచి ప్లేస్‌ కి వెళ్తాం – సునీత

పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ వార్త మంచి ఆసక్తి కనబరస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని రూమర్లు క్రియేట్ చేసారు. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని, సునీత ఏరి కోరి భర్తతో మాల్దీవులకు ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఆమె రెండో పెళ్లి పై అనేక రూమర్స్ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. కాగా, […]

Written By:
  • admin
  • , Updated On : January 15, 2021 / 10:54 AM IST
    Follow us on


    పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ వార్త మంచి ఆసక్తి కనబరస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని రూమర్లు క్రియేట్ చేసారు. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని, సునీత ఏరి కోరి భర్తతో మాల్దీవులకు ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఆమె రెండో పెళ్లి పై అనేక రూమర్స్ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. కాగా, తాజాగా ఈ రూమర్ల పై సునీత క్లారిటీ ఇస్తూ.. ‘కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలనుకున్నాం. అందుకే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించడం జరిగింది.

    Also Read: శుభాకాంక్షలతో ‘మోసగాళ్లు’ న్యూ పోస్టర్

    అయితే మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి కావడంతో.. అతిథుల జాబితా 200కు చేరింది. ఇక మా హనీమూన్ గురించి రోజుకొక రకంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ముందు మేం వెళ్లి కలవాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. అలాగే వారికి చిన్న చిన్న పార్టీలు కూడా ఇవ్వాలి. అలాగే కొన్ని గుళ్ళకు కూడా మేం వెళ్ళాలి. అవ్వన్నీ పూర్తైన తరువాతే మా హనీమూన్ ను ప్లాన్ చేస్తాము. అయితే, హనీమూన్ కోసం మేము మాల్దీవులకు వెళ్ళబోతున్నామని అంటున్నారు, గాసిప్స్ కూడా వచ్చాయి. ఒక్కటి అయితే నిజం మా హానీమూన్ కోసం మంచి ప్లేస్‌కి ఎక్కడికైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చింది సునీత.

    Also Read: సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ పాత్ర‌లతో.. !

    ఇక తన కొత్త శ్రీవారి గురించి చెబుతూ ‘రామ్ నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయన నా సోషల్ మీడియా అకౌంట్స్‌‌ని మెయిన్‌టైన్ చేసేవాడు. అలా మా ఇద్దరికి పరిచయం, ఆ పరిచయం స్నేహంగా మారి.. ఈ బంధం వరకూ తీసుకొచ్చింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. మన కష్ట సుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం అదృష్టం. రామ్‌ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. అయితే రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు నాకు నా పిల్లలే గుర్తుకువచ్చారు. నా పెళ్లి నిర్ణయాన్ని నా పిల్లలతో పంచుకున్నప్పుడు వాళ్లు చాలా సంతోషించారు. అని తన ఆనందాన్ని తెలిపింది సునీత.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్