Jr NTR War 2 Villain Role: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వైవిధ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళు చేసే పాత్రలతో ఓవర్ నైట్ లో స్టార్లుగా వెలుగొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అలాంటి మంచి పాత్రలు కొందరికి మాత్రమే దొరుకుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా స్టార్ హీరోలుగా చేస్తున్న ప్రతి నటుడు సైతం కలెక్టెడ్ గా పాత్రలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక అలా కాకుండా విలన్ పాత్రను పోషించాలంటే మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రెసెంట్ చేస్తూ ఎవరికి వారు వాళ్ళ ఐడెంటిటిని చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు…ఇక రీసెంట్ గా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషించాడు. అయితే ఆ విలన్ పాత్ర కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు. ఏదో విలన్ ఉండాలి కాబట్టి ఉన్నాడు. సినిమాను నడిపించాలి కాబట్టి నడిపించారు అన్నట్టుగానే ఉంటుంది. నిజానికి ఎన్టీఆర్ చాలా మంచి నటుడు అతనిలోని విలనిజాన్ని పూర్తిస్థాయిలో బయటికి తీసి వాడుకుంటే అదొక గొప్ప పాత్రగా నిలుస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇంతకుముందు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలో జై అనే పాత్ర చేశాడు. ఇందులో ఆయన క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో ఉంటుంది. అందులో ఆయన నటించడమే కాకుండా విలనిజాన్ని తారాస్థాయిలో ఎలివేట్ చేసి చూపించాడు. ఈ వార్ 2 సినిమాలో కూడా ఇలాంటి ఒక పాత్రని రాసుకొని ఉంటే బాగుండేది. అయితే ఇందులో ఎన్టీఆర్ విప్ గా చేసినప్పటికి ఆయన నటనలో మాత్రం పెద్దగా వైవిధ్యాన్ని కనబరిచే స్కోప్ అయితే లేకుండా పోయింది.
Also Read: కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
మరి దర్శకుడు ఎందుకని ఆయన పాత్రను ఇలా డిజైన్ చేశాడు. ఎన్టీఆర్ లాంటి మంచి నటుడుని తీసుకున్నప్పుడు అతనిలోని హవా భావాలను పలికించే విధంగా గొప్ప క్యారెక్టర్ రాసుకొని ఉంటే బాగుండేది. దానికి తగ్గట్టుగా సీన్లను క్రియేట్ చేసి అందులో ఎన్టీఆర్ నటనను ఎలివేట్ చేసే విధంగా పలు మార్పులు చేర్పులు చేసుకొని ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండేది.
అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే వచ్చేది. ఇక వార్ 2 సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు సైతం వార్ 2 సినిమాని జై లవకుశ సినిమాతో పోలుస్తూ చాలావరకు ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటన జైలవకుశలో అద్భుతంగా ఉంటుంది.
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమా గ్లింప్స్.. రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
మరి అలాంటి నటుడిని తీసుకొచ్చి ఇలా ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేని పాత్రలో నటింపజేయడం అనేది చాలా దారుణమైన విషయం అంటూ దర్శకుడు అయాన్ ముఖర్జీని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ చేసిన జై లవకుశ సినిమా ఒకసారి చూడు అందులో అతని విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో నీకు అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ మొత్తం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి…