Coolie 1st Day Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కూలీ(Coolie Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న సినిమాలతో మొదటి నుండే ఇదే సమస్య, అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండాలి, లేకపోతే ఎంత బాగున్నప్పటికీ కూడా టాక్ తేడా అయిపోతుంది. అయితే కూలీ చిత్రం మరీ అంత గొప్పగా ఏమి లేదు కానీ, పర్వాలేదు, ఈ మాత్రం ఉంటే చాలు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్లాస్ట్ అవుతాయి అనే నమ్మకాన్ని మాత్రం అందించింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం మొదటి రోజే సెన్సేషనల్ గ్రాస్ నంబర్స్ ని నమోదు చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 161 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కేవలం కర్ణాటక ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 14 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది తమిళ సినిమాల్లో ఆల్ టైం రికార్డు గా చూడొచ్చు. అంతకు ముందు విజయ్ నటించిన లియో చిత్రానికి 13 కోట్ల 65 లక్షల గ్రాస్ పేరిట ఆల్ టైం రికార్డు ఉండేది. ఇక తమిళనాడు ప్రాంతం విషయానికి వస్తే మొదటి రోజు దాదాపుగా 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆల్ టైం టాప్ 3 గ్రాస్సర్ గా నిల్చింది. మొదటి రెండు స్థానాల్లో విజయ్ బీస్ట్, లియో చిత్రాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపుగా 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఇక కేరళలో అయితే ఈ సినిమా అక్షరాలా పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి గ్రాస్ వసూళ్లు ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా రాలేదు.
Also Read: టాలీవుడ్ గుట్టు బయటపెట్టిన అల్లు అరవింద్…
అలా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి వచ్చిన గ్రాస్ వసూళ్లు దాదాపుగా 83 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ సంగతి సరే సరి. అసలే రజినీకాంత్ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద యమకింకరుడు లాంటి వాడు, ఇక ఈ రేంజ్ కాంబినేషన్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ వస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయని మనమంతా ఊహించామో, అలాంటి వసూళ్లే వచ్చాయి. కేవలం నార్త్ అమెరికా లోనే ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల్లో 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ ఈ చిత్రానికి మొదటి రోజు ఓవర్సీస్ లో 8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లో చూస్తే 70 కోట్ల రూపాయలకు పైమాటే, అలా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 161 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.