War 2 Box Office Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఓపెనింగ్స్ పరంగా కానీ, లాంగ్ రన్ పరంగా కానీ తీవ్రమైన నిరాశకు గురి చేసిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక రేంజ్ నెగిటివ్ పబ్లిసిటీ తో రిలీజ్ అయిన ఏకైక సినిమా కూడా ఇదే. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా ఏకంగా పుష్ప 2 రికార్డుని కొట్టింది. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ కూడా కల్కి, సలార్ రేంజ్ లోనే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన సినిమా కావడంతో అందరూ కచ్చితంగా టాప్ 1 రేంజ్ ఓపెనింగ్ ని పెడుతుందని అనుకున్నారు కానీ, డిజాస్టర్ టాక్ రావడంతో అది కుదర్లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 40 కోట్ల ఓపెనింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Also Read: ‘జైలర్ 2’ లో బాలయ్య లుక్ రిలీజ్ చేయబోతున్నారా..?బాలయ్య క్యారెక్టర్ పేరేంటో తెలుసా..?
ఇది కాసేపు పక్కన పెడితే ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోయే ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్ 2′(War 2 Movie) చిత్రానికి ‘హరి హర వీరమల్లు’ కంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు 400K గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా రాలేదు. ఇది ఫ్యాన్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయం. నేటి తో ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి 332K గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘హరి హేరా వీరమల్లు’ కి ఇదే సమయం లో 408K డాలర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫైనల్ ప్రీ సేల్స్ తెలుగు వెర్షన్ కి 390K రేంజ్ లో ఉండేలా అనిపిస్తుంది.
Also Read: సినిమా షూటింగులు బంద్…కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోందా..?
ఎన్టీఆర్ లాంటి క్రేజీ స్టార్ హీరో కి ఇప్పుడు వచ్చిన గ్రాస్ వసూళ్లు చిల్లర తో సమానం. ఆయన గత చిత్రం ‘దేవర’ కేవలం నార్త్ అమెరికా నుండి ప్రీమియర్ షోస్ ద్వారా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సినిమా తర్వాత హాఫ్ మిలియన్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ గ్రాస్ కూడా పెట్టలేకపోవడాన్ని చూస్తుంటే, హైప్ లేకపోతే ఈ కాలం లో సినిమాలు నిలబడవు. ఒకవేళ నిలబడాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ భీభత్సంగా రావాలి. మరి ఆ రేంజ్ టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకుండా లేదా అనేది చూడాలి. మరోపక్క సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఈ రెండు చిత్రాల గ్రాస్ లను చెప్పుకుంటూ ట్రోల్స్ వేసుకుంటున్నారు.