Balakrishna Look in Jailer 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి… ఇక ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు లాంటి నాలుగు వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు మరోసారి బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే…మరోసారి వాళ్ళ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు కి అత్యంత సన్నిహితులైన వాళ్లలో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు… ప్రస్తుతం రజినీకాంత్ చేస్తున్న ‘జైలర్ 2’ (Jailer 2) సినిమాలో బాలయ్య ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. జైలర్ మొదటి పార్ట్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఇద్దరు క్యామియో లు పోషించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర వహించారు. మరి సెకండ్ పార్ట్ లో బాలయ్య బాబు నటించడమే కాకుండా తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: కాళ్ళు లేని వ్యక్తి ‘బిగ్ బాస్ 9’ లోకి..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!
బాలయ్య బాబు పాత్ర 15 నిమిషాల పాటు ఉంటుందట. ఇక పోలీస్ ఆఫీసర్ గా తను నటించడమే కాకుండా తన క్యారెక్టర్ నేమ్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు లో కూడా ఈ సినిమాకి మంచి బజ్ రావాలనే ఉద్దేశ్యంతోనే బాలయ్య బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అతని క్యారెక్టర్ పేరుని రివిల్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే బాలయ్య బాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొని సినిమా షూట్ ని కంప్లీట్ చేశారు… పాత్ర పేరు ‘ ఎస్సై సింహా ‘ గా తెలుస్తోంది. ఇక సింహా అనే ఒక పవర్ఫుల్ టైటిల్ బాలయ్య బాబుకు ఎంత గుర్తింపును సంపాదించి పెట్టిందో మనందరికీ తెలిసిందే. ఆయన ప్రతి సినిమాలో కూడా సింహా అనే టైటిల్ వచ్చే విధంగా చూసుకుంటూ ఉంటాడు.
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
ఇక దీన్ని పసిగట్టిన డైరెక్టర్ నెల్సన్ తెలుగు వాళ్లకి అలాగే బాలయ్య బాబు అభిమానులకి బాలయ్యను మరింత దగ్గర చేసే క్రమంలో ఆ పాత్ర పేరు కూడా ఎస్ఐ సింహా గా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబుకు భారీ ఎలివేషన్ షాట్స్ అయితే ఉండబోతున్నాయట…ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. రజినీకాంత్ తన ఎంటైర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…