War 2 Telugu Bookings: మరో ఆరు రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ పోరు లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. విషయం ఏమిటంటే ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie), అదే విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రాలు ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్నాయి. రెండు ప్రెస్టీజియస్ సినిమాలే. కానీ ‘కూలీ’ కి ఉన్నంత హైప్, క్రేజ్ లో ‘వార్ 2’ చిత్రానికి కనీసం పావు శాతం కూడా లేదు. బయట మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉందంటే, అనవసరం ‘వార్ 2’ చిత్రం ‘కూలీ’ తో క్లాష్ పెట్టుకుంటుంది, వేరే తేదీన విడుదల అయ్యుంటే కచ్చితంగా ‘వార్ 2’ కి భారీ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓజీ లో విలన్ క్యారక్టర్ మిస్ చేసుకున్న టాప్ స్టార్ హీరో అతనేనా..? చేసుంటే పాన్ ఇండియా దద్దరిల్లేది!
ఓవర్సీస్ లో రెండు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. యాష్ రాజ్ సంస్థ వారు నార్త్ అమెరికా లో ‘వార్ 2’ చిత్రానికి అప్పుడే 1800 షోస్ ని షెడ్యూల్ చేశారు. అందులో తెలుగు వెర్షన్ కి సంబంధించి షోస్ 800 వరకు ఉంటాయి. ‘కూలీ’ కంటే ఎక్కువ షోస్ ఉన్నప్పటికీ కూడా ‘వార్ 2’ కి టికెట్స్ అమ్ముడుపోవడం లేదు. కూలీ చిత్రానికి ఇప్పటి వరకు 44,508 టికెట్స్ అమ్ముడుపోతే, ‘వార్ 2’ చిత్రానికి తెలుగు + తమిళ వెర్షన్ కి కలిపి 9,312 టికెట్స్ అమ్ముడుపోయాయి. ‘వార్ 2’ కనీసం ‘కూలీ’ తెలుగు వెర్షన్ గ్రాస్ వసూళ్లను కూడా దాటలేకపోయింది. తెలుగు లో కూలీ చిత్రానికి 9 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతే, ‘వార్ 2’ చిత్రానికి కేవలం 7800 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. గ్రాస్ చూస్తే ‘వార్ 2’ చిత్రానికి తెలుగు వెర్షన్ లో $217K గ్రాస్ వస్తే, కూలీ కి $290K గ్రాస్ వచ్చింది.
Also Read:‘వార్ 2’ క్లైమాక్స్ సీన్ తర్వాత ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్!
అంటే ఎన్టీఆర్ పేరు తెలుగు వెర్షన్ కి పనికొచ్చింది అంతంత మాత్రమే అన్నమాట. మేకర్స్ కనీసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చిన పాటని విడుదల చేసి ఉండుంటే బాగుండేది. కానీ కేవలం ఒక చిన్న ప్రోమో తో సరిపెట్టారు. ఒకవేళ ఈ పాట విడుదలై సూపర్ హిట్ అయ్యుంటే కచ్చితంగా ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయ్యేది. కానీ బ్యాడ్ లక్ అలా ఉంది మరీ. అన్నీ థియేటర్స్ లోనే చూడాలని అంటున్నారు యాష్ రాజ్ సంస్థ. కాబట్టి ‘వార్ 2’ కి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం దారుణంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆదివారం నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కనీసం ఇక్కడ అయినా ‘కూలీ’ ని డామినేట్ చేస్తుందో లేదో చూడాలి.