War 2 AP Collections: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, గడిచిన రెండు దశాబ్దాల నుండి ఏ స్టార్ హీరో కూడా చూడనటువంటి ఘోరమైన డిజాస్టర్ ని జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ‘వార్ 2′(War 2 Movie) చిత్రం తో చూసాడు. ‘టెంపర్’ నుండి ‘దేవర’ వరకు వరుసగా 7 సినిమాలకు తన అభిమానులను ఎత్తిన కాలర్ ని దించకుండా చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘వార్ 2’ చిత్రం తో చాలా కాలం తర్వాత అభిమానులకు ఫ్లాప్ రుచి చూపించాడు. అలాంటి ఇలాంటి ఫ్లాప్ కాదు ఇది, స్టార్ హీరోలు మూడు రోజుల్లో వంద కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొడుతున్న ఈ రోజుల్లో 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ల లోపే క్లోజింగ్ ని వేయాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు వాపోతున్నారు. వీకెండ్ వరకు ఎదో పర్వాలేదు లే అనే రేంజ్ లో హిందీ వెర్షన్ వసూళ్లు ఉండేవి. కానీ మొదటి సోమవారం ఈ సినిమా వసూళ్లు హిందీ వెర్షన్ లో కూడా దారుణంగా పడిపోయాయి.
ఇక తెలుగు వెర్షన్ అయితే అభిమానులకు ఈ సినిమా రక్త కన్నీరు పెట్టిస్తుంది. ఎన్టీఆర్ కి ఇలాంటి వసూళ్లు వస్తాయని వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. మొదటి రోజు రావాల్సిన వసూళ్లు క్లోజింగ్ లో కూడా రావడం కష్టమైంది. ఇక నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి నాలుగు జిల్లాలు డెఫిసిట్స్ ని ఎదురుకున్నాయి. అంటే షేర్ లేక మైనస్ షేర్స్ అన్నమాట. అలా నైజాం, కృష్ణ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా మరియు ఉత్తరాంధ్ర జిల్లాలు. ఇక మిగిలిన ప్రాంతాల నుండి కేవలం 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి దారుణమైన వసూళ్లను ఎన్టీఆర్ తన మొదటి సినిమాకి కూడా చూసి ఉండదు. ‘వార్ 2’ అనే చిత్రం ఆయనకు ఒక పెద్ద వార్నింగ్ బెల్ లాంటిది, భవిష్యత్తులో ఇలాంటి రోల్స్ ఆయన ఒప్పుకోవద్దు అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు సూచనలు అందిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ తల్లిపై నీచమైన కామెంట్స్ చేస్తున్న లోకేష్ అభిమానులు..చూస్తే రక్తం మరిగిపోతాది!
మరి ఎన్టీఆర్ అవన్నీ తీసుకుంటాడా?, అభిమానుల అభిలాష కి తగ్గట్టుగా నడుస్తుంటాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా మీదనే ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ ని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపించినంత పవర్ ఫుల్ గా చూపించాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో క్యారక్టర్ కోసం ఎన్టీఆర్ చాలా సన్నగా తయారు అయ్యాడు. మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ జానర్ లో మరో సినిమా చేయనున్నాడు.