Lokesh fans comments on Jr NTR mother: అవసరమైనప్పుడు తెలుగు దేశం పార్టీ కోసం ఎన్టీఆర్(Junior NTR) చేసిన ప్రచారం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘ప్రజారాజ్యం’ పార్టీ వేవ్ నుండి టీడీపీ పార్టీ అతి దారుణంగా ఓడిపోకుండా, అప్పట్లో 90 సీట్లు గెలిచి రెండవ స్థానం లో నిల్చిందంటే అందుకు ఎన్టీఆర్ చేసిన ప్రచారమే కారణం. ఈ క్రమం లో ఆయనకు రోడ్డు యాక్సిడెంట్ కూడా జరిగింది. రక్తపు మడుగులో పడున్న ఎన్టీఆర్ ని చూసి కోట్లాది మంది అభిమానులు గుండెలు బాదుకుని ఏడ్చిన రోజులవి. పార్టీ కోసం ఎన్టీఆర్ అంత కష్టపడితే, బదులుగా ఆయనకు వచ్చిందంటూ ఏది లేదు. పైగా ఆయన్ని టీడీపీ ఎమ్మెల్యే లు, కార్యకర్తలు అత్యంత నీచమైన భాషతో దుర్భాషలు ఆడుతూ ఎన్టీఆర్ ని, ఆయన తల్లి గారిని నీచంగా అవమానిస్తున్నారు. అనంతపూర్ టీడీపీ ఎమ్మెల్యే మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఆ ఆడియో లో ఉన్నది నా గొంతు కాదు బాబోయ్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే అంటున్నాడు మరో పక్క RAW ఎన్టీఆర్ అనే వ్యక్తి ఫోరెన్సిక్ లో టెస్టులు చేయించి ఇది AI ఆడియో కాదు, నిజమైన ఆడియో అని నిన్న తేల్చి చెప్పాడు. కానీ ఇతన్ని కూడా నమ్మేదానికి వీలు లేదు, ఎందుకంటే ఇతను వైసీపీ పార్టీ లో ప్రస్తుతం ఉంటున్నాడు. కాబట్టి వీళ్లిద్దరి వెర్షన్స్ వీళ్ళవే, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు బయటకి వచ్చి ఈ వ్యవహారం లో తలదూరిస్తే తప్ప అసలు నిజం ఏంటో బయటపడడు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి టీడీపీ కార్యకర్తలకు మధ్య సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే నడుస్తుంది. అది ఇప్పుడు తారా స్థాయికి చేరిపోయింది. ముఖ్యంగా లోకేష్(Nara Lokesh) అభిమానులు నిన్న ట్విట్టర్ స్పేస్ లో మాట్లాడిన మాటలు వింటే ఎన్టీఆర్ అభిమానికి మాత్రమే కాదు, సాధారణ అభిమానికి కూడా రక్తం మరిగిపోతాది, మీరు కూడా ఆ ఆడియో వినాలనుకుంటే కింద వినండి.
Also Read: జగన్ ని కలవబోతున్న జూనియర్ ఎన్టీఆర్??
ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా తక్కువ వాళ్ళు లేరు, వాళ్ళు కూడా ఇదే తరహా లో బూతులు మాట్లాడుతూ ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఇలాంటివి ఎప్పుడూ ఉండేవే, కానీ ఎందుకు వీళ్ళందరూ ఇంట్లోని ఆడవాళ్లను ప్రస్తావించకుండా గొడవ చేసుకోరు?, ఈ సమాజం లో స్త్రీ ని ప్రత్యక్ష్య దైవం గా మనం భావిస్తూ ఉంటాము. అలాంటి స్త్రీ ప్రస్తావన లేకుండా తిట్టుకోలేరా?. కేవలం వీళ్లిద్దరి అభిమానులు మాత్రమే కాదు, సోషల్ మీడియా లో జరిగే ప్రతీ ఫ్యాన్ వార్ లో స్త్రీ ని కలపకుండా బూతులు కనిపించడం చాలా అరుదు అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు, మారాలి, మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ వీడియో లోకేష్ వరకు చేరితే ఆయన కచ్చితంగా వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశలు ఉంటాయి.
Jr NTR గారి తల్లి గురించి నిచాంగా మాట్లాడ్తున్న నారా లోకేష్ సభ్యులు… @Love_Cinemaa @chowdary_daya11 @VishwaTarakk99 @CBNArchives @Ntr1166177 @SonuReddy9999 @DragonWarbegins @Vardhan_tarak pic.twitter.com/kAIIX7GAJJ
— OG (@MeghaAbhimani) August 17, 2025