Jr NTR and Nagarjuna: మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర ఇండస్ట్రీస్ కి సంబంధించిన దర్శకులను నమ్మి ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణగా ‘వార్ 2′(War 2 Movie), ‘కూలీ'(Coolie Movie) చిత్రాలు నిలిచాయి. ఒకే రోజున విడుదలైన ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కూలీ చిత్రం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్ క్యారక్టర్ చేయగా, ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ విలన్(Junior NTR) క్యారక్టర్ చేశాడు. అసలు డైరెక్టర్ వీళ్లిద్దరికీ ఏమని చెప్పి ఒప్పించాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాగార్జున అంటే సీనియర్ హీరో, ఇప్పుడు ఆయనకు మార్కెట్ కూడా లేకపోవడం, హీరో గా చేసేందుకు సరైన కథలు లేకపోవడం వల్ల, కాస్త కొత్తగా ఉంటుందేమో అని విలన్ క్యారక్టర్ చేసి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ కి ఏమి అవసరం?, ఆయన ప్రస్తుత పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు.
ఆయనతో సినిమాలు చేసేందుకు పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్ అవుట్ డేట్ అయిపోయిన స్పై యూనివర్స్ లో భాగమైన ‘వార్ 2’ లో విలన్ క్యారక్టర్ చేయడానికి ఒప్పుకున్నప్పుడే అందరూ ఎన్టీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటూ అప్పట్లో కామెంట్ చేశారు. చివరికి వాళ్ళు అనుకున్నదే అయ్యింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎన్టీఆర్ అభిమానుల వెర్షన్ ఏమిటంటే నార్త్ ఇండియన్ మార్కెట్ లో పాగా వెయ్యడానికే ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని, ఆయన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ కి నార్త్ ఇండియా లో కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ కి ‘వార్ 2’ భీజం వేస్తుందని చెప్పుకొచ్చారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ హీరో హృతిక్ రోషన్ క్యారక్టర్ ముందు తేలిపోయింది. ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ విలన్ క్యారక్టర్ చేస్తున్నాడంటే, క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా రాయాలి?, కానీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు.
Also Read: 4 జిల్లాల నుండి ‘మైనస్’ షేర్లు నమోదు చేసుకున్న ‘వార్ 2’..చరిత్రలో ఇదే తొలిసారి!
ఫలితంగా ఈ చిత్రం ఇటు తెలుగు లోనూ, అటు హిందీ లోనూ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎన్టీఆర్ కి అనవసరంగా సమయం వృధా, ఎనర్జీ కూడా వృధా. ఈ గ్యాప్ లో కొరటాల శివ లాంటి డైరెక్టర్ తో ఆయన ‘దేవర’ లాంటి మరో చిత్రాన్ని చేసేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి సమయాన్ని కేటాయించి వృధా చేసుకున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో పక్క రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో నాగార్జున పోషించిన విలన్ క్యారక్టర్ కూడా ఆయనకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఎదో లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేశాను అనే తృప్తి తప్ప, నాగార్జున కి మిగిలింది ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన క్యారక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ లో మాత్రం బాగా పడిపోయింది. అభిమానులకు అసలు నచ్చలేదు, సోషల్ మీడియా లో దయచేసి ఇలాంటి క్యారెక్టర్స్ చేయొద్దు అంటూ నాగార్జున ని ట్యాగ్ చేసి అభిమానులు బ్రతిమిలాడుతున్నారు.