War 2
War 2 : ‘దేవర'(Devara Movie) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) చేస్తున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie). హ్రితిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశభక్తుడిగా ఉన్న ఎన్టీఆర్ దేశ ద్రోహి గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశం చూసే ఆడియన్స్ కి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి. ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ మధ్య ఒక పాట చిత్రీకరణ, అలాగే వారిద్దరి మధ్య క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ మినహా, టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యిందని అంటున్నారు. అయితే రీసెంట్ గానే డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో హ్రితిక్ రోషన్ కాళ్లకు గాయాలు అవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. మరో వారం రోజుల వరకు సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు .
Also Read : వార్ 2′ విడుదల తేదీ పై సంచలన ప్రకటన చేసిన మూవీ టీం..ఇక అభిమానులకు పండగే!
ఇదే కనుక నిజమైతే ఆగష్టు 14న ఈ సినిమా థియేటర్స్ లోకి రావడం కష్టమే. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఒక భారీ పోరాట సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశానికి ముందు ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ మధ్య వచ్చే చేస్ సన్నివేశం ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటుందట. ఇక ఆ తర్వాత ట్రైన్ పైన వీళ్లిద్దరి మధ్య వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్ లో ఉంటుందట. ఫ్యాన్స్ కి వీళ్ళ మధ్య వచ్చే నువ్వా, నేనా అనే తరహా సన్నివేశాలన్నీ విజువల్ ఫీస్ట్ లాగానే ఉంటుందని, సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చ నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే కలెక్షన్ల సునామీ ని ఎవ్వరూ ఊహించలేరు. పుష్ప 2 చిత్రానికి ఫుల్ రన్ 1800 కోట్ల రూపాయిలు వస్తే, ఈ సినిమాకు పది రోజుల్లోనే 2000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు లో ఎన్టీఆర్ సూపర్ స్టార్, ఇక హిందీ లో హ్రితిక్ రోషన్ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే, వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి, రెండు ఇండస్ట్రీస్ లో పుష్ప 2 తో సరిసమానమైన ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు ఆగష్టు 14 న ఈ సినిమా విడుదలైతే ‘పుష్ప 2 ‘ రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, హిందీ సెట్ అయ్యింది కానీ, ఇతర భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read : వార్ 2 మరో ఆధిపురుష్ కానుందా..? మరి ఎన్టీయార్ పరిస్థితి ఏంటి..?