War 2 Movie Twitter Review: ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎదురు చూసారు. ‘దేవర’ తర్వాత వస్తున్న సినిమా, మళ్ళీ ఎన్టీఆర్ సోలో హీరో సినిమా చూడాలంటే ఇంకో ఏడాది ఆగాల్సి వస్తుంది, అందుకే ఈ చిత్రం ద్వారా చూడొచ్చు అనే ఆశపడ్డారు. ఎన్టీఆర్ ఇందులో విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు అని తెలిసినా, అభిమానులను సంతృప్తి పరిచే లాగా చివర్లో ఎదో ఒకటి పెడతారని అనుకున్నారు. అందుకే తెలంగాణ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కేవలం ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ అని అనుకోవచ్చు. అయితే ఈ సినిమా ని చూసిన ట్విట్టర్ ఆడియన్స్ ఏమంటున్నారు?, ఎన్టీఆర్ అభిమానులను ఈ చిత్రం సంతృప్తి పరిచిందా లేదా అనేది చూద్దాం.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
ట్విట్టర్ లో నెటిజెన్స్ ఇస్తున్న రివ్యూస్ ని బట్టీ చూస్తుంటే, ఫస్ట్ హాఫ్ ఎదో అలా సాఫీ గా సాగిపోతుంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశానికి నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. దారుణమైన VFX ని ఉపయోగించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా అలా సాగిపోతుందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ స్పై సినిమాల్లో ఉన్నట్టుగానే ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది అట. ఎన్టీఆర్ ని అయితే క్లైమాక్స్ వరకు రెగ్యులర్ విలన్ లాగానే చూపిస్తారట. క్లైమాక్స్ లో ఒకే ఒక్క భారీ డైలాగ్ తో మళ్ళీ ఆయన్ని మంచోడిని చేస్తారట. ఇది అసలు సంతృప్తి పరిచే విధంగా ఉండదు, ఎదో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందకూడదు అన్నట్టుగా ఉంటుంది అట. ఓవరాల్ గా అయితే ఇది రొటీన్ సినిమా , స్పై యూనివర్స్ లోనే వీక్, దీంతో స్పై యూనివర్స్ ముగిసినట్టే అని చూసినవాళ్లు అంటున్నారు.
#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!
The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…
— Venky Reviews (@venkyreviews) August 14, 2025
ఎన్టీఆర్ ఇలాంటి టైం వేస్ట్ రోల్స్ చేయడం ఆపేయాలని అంటున్నారు ఈ సినిమాని చూసిన వాళ్లంతా. ఆయన కేవలం హీరో క్యారెక్టర్స్ చేస్తే చాలని, ఇలాంటి రోల్స్ చేస్తూ పోతే భవిష్యత్తులో ఆయన ఫ్యాన్ బేస్ పై చాలా బలమైన ప్రభావం పడే అవకాశం ఉందని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. ఒక పక్క ప్రభాస్ ఇండియా మొత్తం షేక్ అయ్యే రేంజ్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నాడు. మరో పక్క అల్లు అర్జున్ కూడా అదే విధంగా ఉంటున్నాడు. రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా నుండి లైన్ లో పడేలా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ, మహేష్ బాబు రాజమౌళి సినిమాలతో భారీ కం బ్యాక్స్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. తీరా చూస్తే ఎన్టీఆర్ ఒక్కడే అన్యాయం అయ్యేలా ఉన్నాడు. ఆయన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ తో, ఎక్కడ ఆ సినిమా ని KGF, సలార్ లతో పోల్చి చూస్తారేమో అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే భయపడుతున్నారు, ఎన్టీఆర్ కాస్త అలెర్ట్ ఉండాల్సిన సమయం వచ్చేసింది.
Average ,Bad
2/5 .
That old concept .
Nothing new !!
Audience should wait for OTT release ( Not atall in theatre ) pic.twitter.com/PqwMDgtZ56— Dauji Deep P. (@DaujiPanda) August 14, 2025
#war2 Morning Morning eh Bali aipoyanu kada
— Mohit Patnaikk (@VMohitPatnaik) August 14, 2025
There is no twist. There is no suprise in the end. I guess YRF didnt even show the final edit to Jr NTR #War2
— T.H.A.R.U.N (@Tharun_Yeluguri) August 14, 2025
Walked out of war 2 midway not for us sorry guys hope you enjoy
— OUR STUPID REACTIONS (@STUPIDREACTIONS) August 13, 2025