War 2 Movie Review: ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… ఇక ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అయిన ‘హృతిక్ రోషన్’ తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘ ఎన్టీఆర్’ కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. సెలబ్రెటీస్ ఎందుకంత ఏడుపు?
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే నుంచి చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్ ను పట్టుకోడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నియమించబడతారు. కానీ ఆయన్ని పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఇక దాంతో ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఎన్టీఆర్ ని స్పై ఆఫీసర్ గా ఎంపిక చేసి హృతిక్ రోషన్ ని పట్టుకోడానికి పంపిస్తారు. మరి వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని పట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ ఈ సినిమా కథని చాలా రొటీన్ గా రాసుకున్నాడు. నిజానికి ఒక స్పై ఆఫీసర్ కథకి సంబంధించిన సినిమాలు చాలా వచ్చాయి. ఇంతకు ముందు బాలీవుడ్ లో వచ్చిన వార్, పఠాన్ లాంటి సినిమాలు కూడా ఇలాంటి కథతోనే రావడం విశేషం…మరి ఈ సినిమాలో ఆయన విజువల్ గా కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. కానీ కొన్ని సన్నివేశాలు మరి గ్రాఫిక్స్ లో చేసినట్టుగా చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి…
ఇక ఇద్దరు హీరోల్ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అయినప్పటికీ టెక్నికల్ గా ఇంకాస్త బెటర్ మెంట్ చూపిస్తే బాగుండేది. ఫస్టాఫ్ లో సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం సినిమాని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసి ఉంటే సగటు ప్రేక్షకుడికి నచ్చేది…ఇక ఎన్టీఆర్ ఇంట్రాడక్షన్ సీన్ అద్భుతంగా ఉంది. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టూలు సైతం ప్రేక్షకుడిని మెప్పిస్తాయి… ఇక మ్యూజిక్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.
ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమా మీద ఇంకాస్త మంచి ఇంపాక్ట్ అయితే వచ్చుండేది… ఇక హృతిక్ రోషన్ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలు చాలా బెటర్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చిన సన్నివేశాల్లో ఇద్దరు ఎవరికి వారు పోటీపడి నటించారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకుడికి ఓకే అనిపించినప్పటికి ఇంకాస్త ఎఫెక్టివ్ గా సినిమాని తీసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ తన పాత్ర లో ఒదిగిపోయి నటించాడు.డైరెక్టర్ ఏదైతే తన క్యారెక్టర్ చెప్పాడో దానిని ఫాలో అవుతూ ఏమాత్రం లిమిట్స్ దాటకుండా తన పాత్ర పరిధిలోనే నటించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక హృతిక్ రోషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన కూడా యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు…
కియారా అద్వాని తన అందం తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికి ప్రేక్షకుల్లో ఒక మ్యాజిక్ ని అయితే క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆమె బికినీలో కనిపించినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు అరుపులు మామూలుగా లేవు… మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికి ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఎమోషనల్ , ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాకి ప్రాణం పోస్తుంది. కానీ ఈ మూవీలో అది కొంతవరకు మిస్సయింది… అయితే విజువల్స్ విషయానికి వస్తే ఓకే అనిపించినప్పటికి చాలా చోట్ల గ్రాఫిక్స్ తో విజువల్స్ క్రియేట్ చేశారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలిసిపోతోంది… ఇక కొన్ని సన్నివేశాలలో యానిమేషన్స్ తో ఎలాగైతే బొమ్మలను క్రియేట్ చేస్తారో అలాంటి బొమ్మలను చూసినట్టే అనిపించింది.
ఏదైనా కూడా నేచురల్ గా రియలేస్టిక్ గా ఉంటే సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతోంది. అలా కాకుండా చెప్పి ప్రేక్షకుడికి అర్థమయ్యే రేంజ్ లో గ్రాఫిక్స్ ని చేసి అది సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమా మొత్తం మీద బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసరమైన సీన్స్ ను కట్ చేస్తే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్టింగ్
ఇంటర్వెల్ సీన్
ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్
మ్యూజిక్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5
