Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు పండగ మొదలు అయిపోయినట్టే. సుమారుగా మూడేళ్ళ నుండి వాళ్ళు ఆయన నుండి సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ సినిమాల పరంగా మాత్రం గడిచిన పదేళ్ల నుండి కాస్త వెనుకబడ్డాడు. ఎక్కువ కాలం పవన్ కళ్యాణ్ ఫ్లాప్స్ లో ఉండడం కొత్తేమి కాదు. అయితే ఆయన గత మూడు చిత్రాల్లో రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలబడాల్సినవి. కానీ గత ప్రభుత్వం టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ ఇవ్వకపోవడం తో భారీ వసూళ్లను చూడలేకపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణ్ ప్రభుత్వమే కాబట్టి ఇష్టమొచ్చినన్ని షోస్ వేసుకోవచ్చు.
Also Read : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమా జూన్ 11 రాత్రి 11:59 నిమిషాల నుండి షోస్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 9న మొదలు అవుతాయాట. ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాగో టికెట్ రేట్స్ వచ్చేస్తాయి, కానీ తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ రేట్స్ దొరకడం చాలా కష్టమైన విషయం. టికెట్ రేట్స్ అయినా వస్తాయేమో కానీ, బెనిఫిట్ షోస్ కి అనుమతి రావడం దాదాపుగా అసాధ్యమే. చూడాలి మరి ఏమి చేయబోతున్నారు అనేది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ని పతిరంగా సినిమాస్ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ఈ గురువారం, లేక శుక్రవారం నుండి ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 3 మిలియన్ డాలర్స్ తియ్యాలని చూస్తున్నారట.
థియేట్రికల్ ట్రైలర్, అదే విధంగా రేపు విడుదల చేయబోతున్న మూడవ పాట,ఈ రెండు క్లిక్ అయితే నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుండి ఆల్ టైం రికార్డు నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే థియేటర్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ని కూడా పూర్తి చేసేసారట. ప్రస్తుతానికి నార్త్ అమెరికా లో టాప్ 5 ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే కల్కి చిత్రానికి దాదాపుగా నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఆ తర్వాత పుష్ప 2 చిత్రం దాదాపుగా 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 2 స్థానం లో నిల్చింది. ఇక ఆ తర్వాత దేవర చిత్రం 2.8 మిలియన్ డాలర్స్ తో టాప్ 3 స్థానాన్ని కైవసం చేసుకోగా, #RRR చిత్రం 2.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని నమోదు చేసుకుంది. వీటిని ‘హరి హర వీరమల్లు’ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
Also Read : హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?