War 2 Public Talk: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి వస్తున్న స్పై జానర్ సినిమాలకు ఈమధ్య క్రేజ్ బాగా తగ్గిపోయింది. అందుకు ఉదాహరణ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ ని తీసుకోవచ్చు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. పఠాన్ తర్వాత ఈ జానర్ సినిమాలను జనాలు చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి సమయం లో ఎన్టీఆర్ ‘వార్ 2’ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించడానికి సిద్ధపడ్డాడు. అభిమానులు మొదట్లో చాలా సంతోషపడ్డారు కానీ, టైగర్ 3 బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేయడం అవసరమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ట్రైలర్ కాస్త ఆసక్తికరంగా ఉండడం తో ఈసారి కొత్త స్టోరీ తో మన ముందుకు రాబోతున్నారేమో అని అంతా అనుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా లేదా అనేది చూద్దాం.
Also Read: తెలుగు హీరోలను కావాలనే నెగెటివ్ క్యారెక్టర్స్ లో చూపిస్తున్నారా..?
ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ సినిమాని చూసిన ఆడియన్స్ డిజాస్టర్ టాక్ చెప్పుకొచ్చారు. నందమూరి అభిమానులు మాత్రం పాజిటివ్ గానే చెప్తున్నారు కానీ, మిగిలిన ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చినట్టు అనిపించడం లేదు. బయట కూడా అందరూ ఈరోజు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కానీ, ‘వార్ 2’ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ లో థియేటర్స్ వద్ద పబ్లిక్ రియాక్షన్ చూస్తుంటే కొంతమంది బాగుందని అంటున్నారు,మరి కొంతమంది డిజాస్టర్ అని అంటున్నారు. కానీ బుక్ మై షో లో రేటింగ్స్ మాత్రం 9 రేంజ్ లో ఉన్నాయి. ఇది నిర్మాతలు మ్యానేజ్ చేశారా?, లేకపోతే నిజంగా పబ్లిక్ నుండి వచ్చిన రేటింగ్స్ నా? అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.
Also Read: ‘కూలీ మూవీ అంత ఒకే కానీ ఈ 2 మైనస్ అయ్యాయా..?
ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే బుక్ మై షో లో ఈ చిత్రానికి ప్రస్తుతం గంటకు 38 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. వీటిలో అత్యధిక శాతం హిందీ వెర్షన్ కి సంబంధించిన టికెట్స్ ఉంటాయి. హిందీ లో స్పాట్ బుకింగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హృతిక్ రోషన్ గత చిత్రం ‘ఫైటర్’ కి కేవలం హిందీ వెర్షన్ కి ఒక్కటే గంటకు 48 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ ‘వార్ 2’ తెలుగు + హిందీ కలిపి 38 అంటే, హిందీ వెర్షన్ నుండి 28 వేల టిక్కెట్లు అమ్ముడుపోయి ఉండొచ్చని అంటున్నారు. కాబట్టి హిందీ వెర్షన్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి,కానీ తెలుగు వెర్షన్ మాత్రం బిలో యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు వెర్షన్ లో 30 కోట్ల రూపాయిల గ్రాస్, అదే విధంగా హిందీ వెర్షన్ లో 35 కోట్ల రూపాయిల గ్రాస్, ఓవరాల్ గా మొదటి రోజు 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.