Mount Everest Pollution Crisis: దట్టంగా పరుచుకున్న మంచు.. ఎముకలు కరిగించే చలి.. దానికి మించేలా శీతల గాలి.. అందువల్లే ఎవరెస్టు ఎక్కడానికి చాలామంది పోటీ పడుతుంటారు. పర్వతారోహకులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. హిమాలయ పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరంగా ఎవరెస్ట్ ఉండడంతో.. దీనిని అధిరోహించాలని చాలామంది భావిస్తుంటారు.
Also Read: ‘వార్ 2’ ఫైనల్ పబ్లిక్ టాక్ ఇదే..ఓపెనింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే!
ఎవరెస్ట్ శిఖరంలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. అక్కడ చల్లటి గాలి ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీ లలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా గడ్డకట్టి పోయి కనిపిస్తుంది. చూసేందుకు శ్వేత వర్ణంలో దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అడుగులు వేయడం.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఒక రకంగా ఇబ్బందికరమే. అయినప్పటికీ పర్వతారోహకులు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ఒక్కో అడుగు వేస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం పర్యాటక ప్రాంతంగా ఉంది. ఈ శిఖరాన్ని గతంలో కొంతమంది మాత్రమే అధిరోహించేవారు. ఇటీవల కాలంలో ఆ సంఖ్య పెరుగుతుంది. పర్యటకుల సంఖ్య పెరుగుతున్న సమయంలో చెత్త కూడా అదే స్థాయిలో పేరుకుపోతోంది. ప్రతి ఏడాది గుడారాలు.. ఆక్సిజన్ బాక్సులు.. ఆహార పదార్థాల ప్యాకెట్లు వంటివి 12,000 కిలోలకు చేరుకుంటున్నాయని..ఈ వ్యర్ధాల వల్ల అక్కడి వాతావరణం మొత్తం నాశనం అవుతుందని తెలుస్తోంది. ఎవరెస్టు శిఖరం నేపాల్ పరిధిలో ఉంటుంది. ఇటీవల కాలంలో ఎవరెస్టు శిఖరంపై పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి నేపాల్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. తిరిగి వచ్చేటప్పుడు పర్వతారోహకులు 8 కిలోల వ్యర్ధాలు తీసుకురావాలని నిబంధన విధించింది. ఈ నిబంధన సత్ఫలితాన్ని ఇస్తోందని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ‘కూలీ మూవీ అంత ఒకే కానీ ఈ 2 మైనస్ అయ్యాయా..?
ఎవరెస్ట్ శిఖరం పై పేరుకుపోయిన చెత్తకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ఆ వీడియో ప్రకారం అందులో గుడారాలు.. ఆక్సిజన్ బాక్సులు.. ఆహార ప్యాకెట్ల వ్యర్ధాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. వాటి వల్ల పర్యావరణానికి ఏ స్థాయిలో నష్టం జరుగుతోందో ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే రోజుల్లో ఎవరెస్ట్ మంచుతో కాకుండా చెత్తతో నిండిపోతుందని పర్వతారోహకులు చెబుతున్నారు.