Coolie Movie Drawbacks: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రజినీకాంత్ అభిమానులు ఈరోజు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కూలీ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉన్నప్పటికి ఒక రెండు విషయాలు మాత్రం ఈ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారాయనే చెప్పాలి. ఆ రెండు మైనస్ లను కనుక సరిచేసుకొని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచేది…ఇంతకీ ఆ మైనస్ లు ఏంటంటే లోకేష్ కనకరాజు ఇంతకుముందు తన సినిమాల్లో చేసిన డైరెక్షన్ ఈ సినిమాలో చేయలేకపోయాడు. ఎంతసేపు కథ మీద దృష్టిని సారించాడు. తప్ప డైరెక్షన్ గురించి పట్టించుకోలేదు. మేకింగ్ మీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది… దాంతోపాటుగా రజనీకాంత్ క్యారెక్టర్ లో ఇంకాస్త వేరియేషన్స్ ను చూపిస్తూ అందులో డెప్త్ ను చూపిస్తే బాగుండేది. ఈ రెండు కనుక పర్ఫెక్ట్ గా సెట్ అయ్యుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయేది… ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఈ నాలుగు రోజుల్లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read: కూలీ vs వార్ 2 : ఈ రెండింటిలో ఏది హిట్..? ఏది ఫట్..?
మరి లాంగ్ టర్న్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది అనేది చాలా కీలకంగా మారబోతొంది. రజినీకాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘జైలర్’ సినిమా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. అయితే ఆ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి రజినీకాంత్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏ మాత్రం మ్యాజిక్ ను అయితే క్రియేట్ చేయలేకపోయాయి.
మరి ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డులు బ్రేక్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక లోకేష్ కనకరాజు సైతం ఎప్పుడు ఒకే టెంప్లేట్ లో సినిమాలను చేయకుండా కొంచెం జానర్స్ మార్చి సినిమాలు చేస్తే బాగుంటుంది.
Also Read: కోలీవుడ్ 1000 కోట్ల కల ‘కూలీ’ నెరవేర్చేనా..? మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
ఇక ఆయన కూడా తన డైరెక్షన్ మీద పూర్తిగా ఫోకస్ ను పెట్టి కొన్ని ఎక్కువ రోజుల సమయం తీసుకున్న పర్లేదు కానీ ఒక బెస్ట్ ప్రొడక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…