Benefits Of Walking: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనిషి ఆయుర్దాయయం క్రమంగా క్షీణిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. రోజు నడక కొనసాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం రెండు పూటల ఓ గంట పాటు నడక సాగిస్తే పలు లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. నడక, వ్యాయామం చేస్తే రోగాలు దూరమవుతాయి. రోజు కాసేపు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి విధితమే. అందుకే ఊబకాయం ఉన్నవారు సైతం రోజు నడిస్తే ఎన్నో లాభాలు ఉన్నట్లు పలు సర్వేలు సూచిస్తున్నాయి.

నడకతో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటాయి. వీటితో బాధపడే వారు వారంలో కనీసం ఐదు రోజులైనా రోజు ఓ గంట పాటు నడిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. రోగాలు కంట్రోల్ లో ఉంటాయి. ఇటీవల చాలా మంది రోజు నడక సాగిస్తున్నారు. నడకతో ఒత్తిడి కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒత్తిడితో ఉన్న సమయంలో చాక్లెట్లు తినే వారు సైతం ఆ అలవాటును తగ్గించుకోవచ్చు. రోజుకు పదిహేను నిమిషాలు నడిస్తే ఆ కోరిక తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది.
వారంలో కనీసం ఏడు గంటలు నడిచే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా ఉండదు. నడిచే మహిళల్లో 14 శాతం మందికి రొమ్ము క్యాన్సర్ దరి చేరనట్లు సర్వేలు చెబుతున్నాయి. అధిక బరువుతో బాధపడేవారు కూడా రోజు నడిస్తే ఎంతో మేలు కలుగుతుంది. నడక దివ్య ఔషధంగా ఎన్నో లాభాలు చేకూరనున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నడిస్తే చాలు మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు.

కీళ్లవాపు సమస్యలున్న వారు కూడా వాటిని తగ్గించుకోవాలంటే నడవాల్సిందే దీంతో వారానికి ఐదారు కిలోమీటర్లు నడవడం ద్వారా కీళ్ల వాపు నివారణ సమస్యలు తగ్గుతాయి. నడవటం వల్ల కీళ్లు, మోకీళ్లు, తుంటి కీళ్లు వంటి వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతమవుతాయి. కీళ్లు ఒరుసుకుపోవడం తగ్గి కదలికలు సాఫీగా సాగుతాయి. కీళ్ల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నడిస్తే ప్రయోజనం ఉంటుంది. నడకతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే అందరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా నడక కొనసాగించి రోగాలు రాని జీవితాన్ని ఆస్వాదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
